అరుదైన వన్యప్రాణి అలుగు.. రూ.5 లక్షలకు బేరం.. ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు అరెస్టు

అరుదైన వన్యప్రాణి అలుగు.. రూ.5 లక్షలకు బేరం.. ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు అరెస్టు

ఆదిలాబాద్ జిల్లాలో అరుదైన వణ్యప్రాణి అలుగును అమ్మకానికి పెట్టిన వేటగాళ్లను అరెస్టు చేశారు అధికారులు. బుధవారం (అక్టోబర్ 08) అలుగును 5 లక్షల రూపాయలకు బేరం పెట్టిన వేటగాళ్లను పట్టుకున్నారు. గాదేగూడ మండలం  అర్జుని లో అలుగును అమ్ముతుండగా వేటగాళ్లను పట్టుకుని అలుగును స్వాధీనం చేసుకున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు.

అర్జునిలో వేటగాళ్లు అలుగును తెచ్చి అమ్మకానికి పెట్టారనే సమాచారంతో.. వెంటనే గ్రామానికి చేరుకున్న అధికారులు.. వేగటాళ్లను పట్టుకున్నారు. మొత్తం ఐదు మంది అలుగును వేటాడినట్లు గుర్తించారు. 

అలుగును అమ్ముతున్న ఐదుగురిపై కేసు నమోదు చేశారు అటవీ అధికారులు. అందులో ముగ్గురిని  అరెస్టు చేయగా.. మరో ఇద్దరు వేటగాళ్లు పరారీలో ఉన్నారు.