ఎంపీ టికెట్ల కోసం..పోటాపోటీ

 ఎంపీ టికెట్ల కోసం..పోటాపోటీ
  •     నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ ఎంపీ  స్థానానికి కాంగ్రెస్​లో ముగ్గురి పోటీ
  •     పాలమూరు టికెట్​ కోసం బీజేపీలోనూ తీవ్ర పోటీ 

మహబూబ్​నగర్​, వెలుగు : లోక్​సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టికెట్ల కోసం పోటీ ఎక్కువవుతోంది.  ప్రధానంగా కాంగ్రెస్​, బీజేపీలకు ఒక స్థానంలో  క్యాండిడెట్లు ఓకే అయినా..  మరో దాంట్లో మాత్రం పోటీకి ఇద్దరు, ముగ్గురు సిద్ధమవుతుండటం తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.  టికెట్లు ఆశిస్తున్న వారంతా సీనియర్లు కావడంతో పార్టీల్లో  వీరిలో ఒకరిని ఎంపిక చేయడం పెద్ద టాస్క్‌‌‌‌‌‌‌‌ లా మారింది.  బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​ పార్టీ మాత్రం ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని రెండు పార్లమెంట్​ స్థానాల్లో ఒక స్థానానికి సిట్టింగ్​కు క్లియర్‌‌‌‌ చేయగా, మరో స్థానంలో అలయన్స్​లో బీఎస్పీకి టికెట్​ ఇచ్చేందుకు సిద్ధమైంది.

నాగర్​కర్నూల్‌‌‌‌‌‌‌‌ ​కాంగ్రెస్​ సీటు కోసం ముగ్గురు పోటీ..

కాంగ్రెస్​ పార్టీ నుంచి మహబూబ్​నగర్​ ఎంపీ స్థానానికి ఆ పార్టీ సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్​ రెడ్డి  పోటీ చేస్తారని అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ప్రచారం జరిగింది.  ఇటీవల సీఎం రేవంత్​ రెడ్డి కూడా వంశీనే మహబూబ్​నగర్​ అభ్యర్థి అని ప్రకటించగా..  శుక్రవారం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధిష్ఠానం ఎంపీ టికెట్ ఇస్తున్నట్లు కన్పర్మ్ చేసింది. నాగర్​కర్నూల్​ స్థానానికి మాత్రం టికెట్​ ఎవరికనేది ఇంకా ఖరారు కాలేదు.  ఈ స్థానం నుంచి టికెట్​ తనకే ఇవ్వాలని మాజీ ఎంపీ మల్లు రవి గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు.  ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇటీవల ఆయన

‘ఢిల్లీలో రాష్ర్ట ప్రభుత్వ అధికార ప్రతినిధి’ పదవికి రాజీనామా చేశారు.  ఇదే స్థానం నుంచి పోటీకి అలంపూర్​ మాజీ ఎమ్మెల్యే సంపత్​ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో సంపత్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అలంపూర్​ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పార్లమెంట్​ ఎన్నికల్లో మరోసారి తనకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్‌‌‌‌‌‌‌‌ వినిపిస్తున్నారు. సీఎంకు సన్నిహితుడైన చారకొండ వెంకటేశ్​ నాగర్​ కర్నూల్​ ఎంపీ టికెట్​ కోసం ప్రయత్నాలు చేస్తునట్లు తెలుస్తోంది. 

బీఆర్​ఎస్​లో క్లియర్​

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభావం తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్​ఎస్​ పార్టీ ఢీలా పడింది. జనవరి నుంచే పార్లమెంట్​ ఎలక్షన్​ మోడ్​ స్టార్ట్​ అయినా ఆ పార్టీ నుంచి రెండు స్థానాల్లో  పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు సిట్టింగ్​ ఎంపీ కూడా పోటీకి దూరంగా ఉండనున్నారనే టాక్​ నడిచింది.  అయితే మహబూబ్​నగర్​ సిట్టింగ్​ ఎంపీ మన్నె శ్రీనివాస్​ రెడ్డికే టికెట్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించారు.

నాగర్​కర్నూల్​ పార్లమెంట్​ నుంచి సిట్టింగ్​ ఎంపీగా ఉన్న రాములుకు కాకుండా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు  ఎంపీ టికెట్​ ఇస్తారనే చర్చ నడిచింది.  దీంతో రాములు బీజేపీలో చేరారు.  అనూహ్యంగా ఆ పార్టీ వచ్చే లోక్‌‌‌‌‌‌‌‌ సభ ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకొని రంగంలోకి  దిగుతున్నట్లు ఆ పార్టీ చీఫ్ ఐదు రోజుల కిందట ప్రకటించారు.  ఇక్కడి నుంచి బీఎస్పీ స్టేట్​ చీఫ్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయనది అలంపూర్​ సొంత నియోజకవర్గం కావడం, నాగర్​కర్నూల్‌‌‌‌‌‌‌‌  పార్లమెంట్​ పరిధిలోనికి రావడంతో ఇక్కడి నుంచి ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్పీ పోటీ చేయడం దాదాపు కన్ఫాం అయ్యిందనే టాక్​ నడుస్తోంది.

పాలమూరు ఎంపీ టికెట్​ కోసం బీజేపీలో టఫ్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌ 

బీజేపీ నుంచి నాగర్​కర్నూల్​ పార్లమెంట్​ అభ్యర్థిగా బంగారు శ్రుతి పేరు మొదటి నుంచి వినిపించినా..  ఫైనల్‌‌‌‌‌‌‌‌గా హైకమాండ్ కొద్ది రోజుల కిందట పార్టీలో చేసిన బీఆర్​ఎస్​ సిట్టింగ్​ ఎంపీ రాములు కొడుకు పి. భరత్​కు టికెట్​ కన్ఫామ్‌‌‌‌‌‌‌‌ చేసింది.  ఇటీవల పార్టీ రిలీజ్​ చేసిన ఫస్ట్ లిస్టులో తొమ్మిది స్థానాలు ఉండగా,  అందులో  నాగర్​కర్నూల్​ నుంచి భరత్ పేరు కూడా ఉంది.  బీజేపీ నుంచి  మహబూబ్​నగర్​ ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు డీకే అరుణ, ఏపీ జితేందర్​ రెడ్డి

బండారి శాంతికుమార్​ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.  టికెట్​ కోసం హైకమాండ్​ వద్దకు వెళ్లి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.  మహబూబ్​నగర్​ పార్లమెంట్​ అభ్యర్థి పేరును ఫస్ట్​ లిస్టులోనే ప్రకటించాల్సి ఉన్నా..  ముగ్గురు పోటీలో ఉండటం, వీరంతా సీనియర్​ లీడర్లు కావడంతో ఎవరి పేరును ఇంకా ఖరారు చేయలేదు. సెకండ్​ లిస్టులో క్యాండిడెట్​ను ప్రకటించే అవకాశాలున్నాయి.