స్టాక్ మార్కెట్లో ఈవారం మూడు కంపెనీలు

స్టాక్ మార్కెట్లో ఈవారం మూడు కంపెనీలు

న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లను ఈవారం మూడు కంపెనీలు పలకరించనున్నాయి. దాదాపు రూ.1,857.95 కోట్లను సమీకరించడానికి తమ పబ్లిక్ ఆఫర్లను తీసుకొస్తున్నాయి. ఈ మూడు ఐపీఓలు విభిన్న రంగాల నుంచి ఉన్నాయి. ఇవే కాకుండా, ఈ వారంలో యూనిపార్ట్స్ ఇండియా లిస్టింగ్​ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు నష్టాల్లో ఉండటం, స్థూల ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడం వల్ల ఐపీఓ మార్కెట్లలో ఆటుపోట్లు కనిపించాయి. అయినప్పటికీ,  మార్కెట్లోకి కొత్త పబ్లిక్ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.

ఈ వారం రాబోతున్న ఐపీఓలు అబాన్ హోల్డింగ్స్:

అబాన్ హోల్డింగ్స్ కూడా సుమారు రూ.345.60 కోట్లను సమీకరించడానికి డిసెంబర్ 12న తన ఐపీఓను మొదలుపెట్టనుంది.  డిసెంబర్ 15 వరకు సబ్‌‌‌‌స్క్రిప్షన్‌‌కు అందుబాటులో ఉంటుంది.  ఇందులో 38 లక్షల ఈక్విటీ షేర్ల ఫ్రెష్​ ఇష్యూ ఉంటుంది.  దాదాపు 90 లక్షల ఈక్విటీ షేర్లను ఓఎఫ్ఎస్​ విధానంలో అమ్ముతారు. ప్రమోటర్ అభిషేక్ బన్సల్ ఓఎఫ్​ఎస్​ ద్వారా వాటాలను అమ్ముతున్నారు.  

ప్రైస్​బ్యాండ్​ ధర రూ.256–రూ.270  మధ్య ఉంటుంది.  దాదాపు 10 శాతం షేర్లను క్యూఐబీల కోసం, 30 శాతం కోటాను సంస్థాగత పెట్టుబడిదారుల (ఎన్​ఐఐ) కోసం రిజర్వ్​ చేశారు. రిటైల్ వ్యక్తిగత పెట్టుబడిదారులకు 60 శాతం వరకు షేర్లను కేటాయిస్తారు. తాజా ఇష్యూ నుంచి వచ్చే ఆదాయంలో రూ.50 కోట్లను తన అనుబంధ సంస్థ అబాన్ ఫైనాన్స్‌‌లో తదుపరి పెట్టుబడుల కోసం ఉపయోగించుకుంటుంది.  మరికొంత ఆదాయాన్ని సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వాడతారు.   

ల్యాండ్‌‌మార్క్ కార్స్​:

 ఆటో మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ ల్యాండ్‌‌మార్క్ కార్స్ తన రూ.552 కోట్ల ఐపీఓని డిసెంబర్ 13న మొదలుపెట్టి డిసెంబర్ 15న ముగిస్తోంది. ఐపీఓ కంటే ముందు డిసెంబర్ 12న యాంకర్ ఇన్వెస్టర్ల కోసం బిడ్డింగ్ ఓపెన్​ అవుతుంది.  ప్రైస్ బ్యాండ్​ను రూ.481–రూ.506  మధ్య నిర్ణయించారు. ఐపీఓలో రూ.150 కోట్ల  తాజా ఇష్యూ ఉంటుంది.

సులా వైన్​యార్డ్స్​:

భారతదేశపు అతిపెద్ద వైన్ తయారీదారు, అమ్మకం దారు సులా వైన్​యార్డ్స్  ఐపీఓ డిసెంబర్ 12న మొదలై 14 వరకు అందుబాటులో ఉంటుంది. ఐపీఓలో తాజా ఇష్యూ ఉండదు. పూర్తిగా ఆఫర్​ ఫర్​ సేల్​ ఉంటుంది. ఈ కంపెనీ శుక్రవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి సుమారు రూ.288.10 కోట్లను సేకరించింది. ఐపీఓ కింద ఆఫర్ ఫర్ సేల్​లో 26,900,530 ఈక్విటీ షేర్లను అమ్ముతుంది. ఒక్కో షేరు ధరను రూ.340–రూ.357 మధ్య నిర్ణయించా రు. అప్పర్ ​బ్యాండ్​ వద్ద సులా ఐపీఓ విలువ సుమారు రూ.960.35 కోట్లు. ఇష్యూ ఆదాయాన్ని కంపెనీ ఉపయోగించదు.  

ఐపీఓలో పాల్గొనే షేర్​హోల్డర్లకే మొత్తం డబ్బు వెళ్తుంది.   ప్రమోటర్ రాజీవ్ సమంత్, కోఫింట్రా ఎస్​.ఏ, హేస్టాక్ ఇన్వెస్ట్‌‌మెంట్స్, సామా క్యాపిటల్ , స్విప్​ హోల్డింగ్స్, వెర్లిన్‌‌వెస్ట్ ఎస్​ఏ , వెర్లిన్‌‌ వెస్ట్ ఫ్రాన్స్ ఎస్​ఏ వంటి పెట్టుబడిదారులు షేర్లను అమ్ముతున్నారు.  ఐపీఓలో 50 శాతం షేర్లను అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు (క్యూఐబీలు) కేటాయిస్తారు. 15శాతం కోటాను సంస్థాగత పెట్టు బడిదారులకు (ఎన్​ఐఐలు) రిజర్వ్ చేస్తారు.  మిగిలిన 35 శాతం షేర్లను రిటైల్ వ్యక్తిగత పెట్టుబడిదారుల కోసం ఉంచుతారు.  సులా  వైన్‌‌యార్డ్స్ భారతీయ వైన్ పరిశ్రమలో మార్కెట్ లీడర్‌‌.