కాకా అంబేద్కర్ విద్యాసంస్థల్లో ప్రాజెక్ట్ ఎక్స్ షో

కాకా అంబేద్కర్ విద్యాసంస్థల్లో ప్రాజెక్ట్ ఎక్స్ షో
  •     ఆకట్టుకున్న స్టూడెంట్ల ప్రదర్శనలు  

ముషీరాబాద్, వెలుగు :  బాగ్​లింగంపల్లి లోని కాకా బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల్లో మూడ్రోజుల పాటు నిర్వహించిన ప్రాజెక్ట్ ఎక్స్ షో సోమవారం ముగిసింది. చివరిరోజు స్టూడెంట్లు వినూత్నంగా తయారు చేసిన వివిధ ప్రాజెక్టులను  ప్రదర్శించారు. 100 మోడల్స్ ను ప్రదర్శించి అబ్బురపరిచారు. ఈ ప్రాజెక్ట్ షోను విద్యాసంస్థల సెక్రటరీ పీవీ రమణ్ కుమార్ సందర్శించారు. ఉత్తమ ప్రాజెక్టులకు బహమతులను అందజేశారు. 

ప్లాస్టిక్​తో పర్యావరణానికి ముప్పు

ముషీరాబాద్ :  ప్లాస్టిక్ వల్లనే పర్యావరణానికి ముప్పు ఉందని తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీబీ) సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి. నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్లాస్టిక్​ను ఈ దశలో నిషేధించకపోతే అది పెనుభూతంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీలో ఈ– వేస్ట్ మేనేజ్​మెంట్ ప్రోగ్రామ్ జరిగింది.  

చీఫ్ గెస్టుగా హాజరైన నాగేశ్వరావు మాట్లాడుతూ.. ప్లాస్టిక్, ఎలక్ట్రిసిటీ వ్యర్థాలను ఎలా నిషేధించాలనే అంశంపై స్టూడెంట్లకు ఆయన అవగాహన కలిగించారు.  పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా స్టూడెంట్లు ఈ– వేస్టేజ్​ను సేకరించి వాటిని నిర్మూలించే సంస్థలకు అందజేయాలని కోరారు.