బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు

 బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించాలని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ నిర్ణయించారు.  జూన్1, జూన్2, జూన్3 తేదీల్లో మూడు రోజులపాటు  పార్టీ అధ్వర్యంలో  ఘనంగా వేడుకలను నిర్వహించాలని పిలుపునిచ్చారు.   జూన్1వ తేదీన గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి ట్యాంక్ బండ్  అమర జ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు.  రాష్ట్ర సాధనలో ప్రాణ త్యాగాలు అమరులకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించనున్నారు.

 జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావమై  దశాబ్ధి కాలం గడుస్తున్న నేపధ్యంలోదశాబ్ది ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు.   తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది.  అదేరోజున హైదరాబాద్ లో  పలు దవాఖానాల్లో , అనాథ శరణాలయాల్లో  పార్టీ ఆధ్వర్యంలో పండ్లు స్వీట్లు పంపిణీ చేయనున్నారు.  

జూన్ 03వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో దశాబ్ధి  ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు.  ఈ సందర్భంగా పార్టీ జెండాతో పాటుగా జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఆయా జిల్లాల్లోని దవాఖానల్లో అనాథాశరణాలయాల్లో స్వీట్లు, పండ్లు పంపిణీ చేస్తారు. దశాబ్ది ముగింపు వేడులను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు.  గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులు, కార్యకర్తలు ముగింపు వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కేసీఆర్ తెలిపారు.