భూమికి దూరంగా మూడ్రోజులు.. స్పేస్​ జర్నీ చేస్తున్నది వీళ్లే!

V6 Velugu Posted on Sep 17, 2021

  • ‘ఇన్​స్పిరేషన్​4’ ప్రయోగాన్ని షురూ చేసిన స్పేస్​ఎక్స్​
  • ఫాల్కన్​ 9 రాకెట్​తో నింగిలోకి ‘డ్రాగన్’​ క్రూ క్యాప్సూల్​
  • ఆర్బిట్​లో అత్యంత సుదూరానికి స్పేస్​ టూరిస్టులు
  • 585 కిలోమీటర్ల ఎత్తులో చక్కర్లు
  • 90 నిమిషాలకోసారి భూమి చుట్టూ ఓ రౌండ్​

కేప్​కెనవెరాల్​: ఇంటర్నేషనల్​ స్పేస్​ స్టేషన్​ (ఐఎస్​ఎస్​).. 420 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ గిరగిరా తిరిగేస్తోంది. కానీ, అంతకుమించిన దూరం వెళ్లింది స్పేస్​ ఎక్స్​ డ్రాగన్​. అంతరిక్ష ప్రయోగాల చరిత్రలోనే భూకక్ష్య నుంచి అత్యంత ఎత్తుకు పంపించిన క్రూ క్యాప్సూల్​ ప్రయోగంగా చరిత్ర సృష్టించింది. తొలిసారి సామాన్యులను అంతరిక్ష కక్ష్యలోకి పంపించి తన పేరిట రికార్డు రాసుకుంది. ‘ఇన్​స్పిరేషన్​4’ ప్రయోగాన్ని అమెరికా ప్రైవేట్​ అంతరిక్ష సంస్థ  స్పేస్​ఎక్స్​ సక్సెస్​ఫుల్​గా నిర్వహించింది. మన టైం ప్రకారం గురువారం తెల్లవారుజామున 5.32 గంటలకు (అమెరికా టైం ప్రకారం బుధవారం రాత్రి 8.02 గంటలు) ఫ్లోరిడాలోని కేప్​కెనవెరాల్​లో ఉన్న నాసా కెనెడీ స్పేస్​ సెంటర్​ నుంచి ఫాల్కన్​9 రాకెట్​ను నింగిలోకి పంపింది. 
మూడు రోజులు.. అత్యంత ఎత్తులో
ఇన్​స్పిరేషన్​ ప్రయోగంలో భాగంగా డ్రాగన్​ క్రూ క్యాప్సూల్​లో మూడు రోజుల పాటు ఆస్ట్రోనాట్లు కక్ష్యలో భూమి చుట్టూ చక్కర్లు కొట్టనున్నారు. భూ కక్ష్య నుంచి 585 కిలోమీటర్ల ఎత్తులో డ్రాగన్​ కక్ష్యలో తిరగనుంది. 90 నిమిషాలకోసారి భూమిని చుట్టేసి వస్తుంది. ఐఎస్​ఎస్​కు డాక్​ అవ్వకుండా డ్రాగన్​ ఒంటరిగానే తన జర్నీ చేస్తోంది. ఇప్పటిదాకా భూమి నుంచి అత్యంత ఎత్తుకు పంపించి ఒంటరిగా కక్ష్యలో తిరిగిన ప్రయోగం ఇన్​స్పిరేషనే కావడం విశేషం. అంతకుముందు 2009 హబుల్​ టెలీస్కోప్​ ప్రయోగంలో భాగంగా 540 కిలోమీటర్ల ఎత్తుకు క్రూ క్యాప్సూల్​ను పంపించారు. కాగా, మూడు రోజుల తర్వాత ఫ్లోరిడాలోని సముద్ర తీరం వెంట డ్రాగన్​ క్రూ క్యాప్సూల్​ దిగనుంది. 
ప్రయోగం వెనక ఓ మంచి కారణం
ఏదో అల్లాటప్పాగా చేస్తున్న ప్రయోగం కాదిది. దాని వెనక ఓ మంచి కారణమూ ఉంది. ఏటా కొన్ని లక్షల మంది చిన్నారులు కేన్సర్​కు బలైపోతున్నారు. ఇకపై అలా జరగకూడదన్న ఉద్దేశంతో జరెడ్​ ఐజాక్​మ్యాన్​ అనే స్వచ్ఛంద కార్యకర్త, పైలట్​..​ పిల్లల్లో కేన్సర్​ను నయం చేసే కొత్త ట్రీట్​మెంట్లపై రీసెర్చ్​ కోసం నడుం బిగించారు. ఆ రీసెర్చ్​ను చేస్తున్న సెయింట్​ జ్యూడ్​ రీసెర్చ్​ హాస్పిటల్​ కోసం 20 కోట్ల డాలర్ల ఫండ్​ రైజింగ్​ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. తన వంతుగా 10 కోట్ల డాలర్లను అందించారు. అందులో భాగంగానే ఈ సుదూర కక్ష్యలోకి ‘హ్యూమన్​ ఫ్లైట్​’ ప్రయోగానికి సంకల్పం తీసుకున్నారు. ఇప్పటిదాకా 13 కోట్ల డాలర్లను రాబట్టగలిగారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి టార్గెట్​ చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక, దాంతో పాటు  ఆర్బిట్​లో డ్రాగన్​ క్యాప్సూల్​ తిరుగుతున్నంత సేపు మనిషి శరీరంలో కలిగే మార్పులపైనా స్టడీ చేయనున్నారు. దాని ద్వారా భవిష్యత్​లో నిర్వహించబోయే సుదూర అంతరిక్ష ప్రయోగాల్లో ఆస్ట్రోనాట్ల ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలను వివరించనున్నారు. 
ఆరు నెలల ట్రైనింగ్​
మిషన్​ను ప్రకటించిన ఈ ఏడాది మార్చి నుంచి ఆరునెలలపాటు ఆస్ట్రోనాట్లకు కఠినమైన ట్రైనింగ్​ను ఇచ్చారు. సెంట్రిఫ్యూజ్​ ట్రైనింగ్​, ఆల్టిట్యూడ్​ (కక్ష్య ఎత్తు) ట్రైనింగ్​, డ్రాగన్​ క్రూ సిమ్యులేషన్స్​, జీరో గ్రావిటీ ప్లేన్​ ట్రైనింగ్​తో పాటు మెడికల్​ టెస్టింగ్​, క్లాస్​రూం శిక్షణనూ ఇచ్చారు. 
తిరిగొచ్చేస్తున్న చైనా ఆస్ట్రోనాట్లు
మూడు నెలల పాటు స్పేస్​లో గడిపిన ముగ్గురు చైనా ఆస్ట్రోనాట్లు భూమికి తిరిగొచ్చేస్తున్నారు. చైనా స్పేస్​ స్టేషన్​లోని కోర్​ మాడ్యూల్​ తియాన్హేను ఈ ఏడాది జూన్​17న చైనా అంతరిక్షంలోకి పంపించింది. అక్కడ ప్రయోగాల కోసం నై హైషెంగ్​, లూ బోమింగ్​, థాంగ్​ హాంగ్బో అనే ముగ్గురు ఆస్ర్టోనాట్లను పంపింది. 90 రోజుల పాటు వాళ్లు అక్కడ ప్రయోగాలు చేశారు. ప్రయోగాలు పూర్తవడంతో కోర్​ మాడ్యూల్​ నుంచి షెంఝూ 12 క్రూ క్యాప్సూల్​ గురువారం ఉదయం 8.56 గంటలకు వేరైంది. ఆ ముగ్గురు ఎక్కువ కాలం పాటు స్పేస్​లో గడిపిన చైనా ఆస్ట్రోనాట్లుగా రికార్డు సృష్టించారు.

స్పేస్​ జర్నీ చేస్తున్నది వీళ్లే...
జరెడ్​ ఐజాక్​మ్యాన్: షిఫ్ట్​4పేమెంట్స్​ అనే స్వచ్ఛంద సంస్థకు సీఈవో. ఆయనో పైలట్​ కూడా. ఇన్​స్పిరేషన్​ ప్రయోగానికి ఆయనే పైలట్​గా (కెప్టెన్​) ఉన్నారు. 
హేలీ ఆర్సినాక్స్​: సెయింట్​ జ్యూడ్​ చిల్డ్రెన్స్​ రీసెర్చ్​ హాస్పిటల్​లో అసిస్టెంట్​ఫిజిషియన్​. అంతేకాదు చిన్నప్పుడే కేన్సర్​ బారిన పడి కోలుకున్నారు. ఈ మిషన్​కు మెడికల్​ ఆఫీసర్​.
క్రిస్​ సెంబ్రోస్కీ: అమెరికా మాజీ ఎయిర్​ఫోర్స్​ అధికారి. ఏరోస్పేస్​ డేటా ఇంజనీర్​. ఇన్​స్పిరేషన్​4కు మిషన్​ స్పెషలిస్ట్​. 
డాక్టర్​ సియాన్​ ప్రోక్టర్​: ఆమె ఓ జియోసైంటిస్ట్​. ఎంట్రప్రెన్యూర్​ కూడా. పైలట్​గా శిక్షణ తీసుకున్నారు. ఈ ప్రయోగంలో మిషన్​ పైలట్​గా వ్యవహరిస్తున్నారు.

డ్రాగన్​ ‘క్యుపోలా’
స్పేస్​ ఎక్స్​ తన డ్రాగన్​ క్రూ క్యాప్సూల్​ ఓ ముఖ్యమైన మార్పును చేసింది. క్యాప్సూల్​ ముందుభాగంలో మూడు లేయర్ల అబ్జర్వేషన్​ డోమ్/విండో ‘క్యుపోలా’ను ఏర్పాటు చేసింది. ఆరు నెలల పాటు దానిని టెస్ట్​ చేసింది. స్పేస్​లో వాతావరణ పరిస్థితులు, వేడి, వైబ్రేషన్​, లైఫ్​ సైకిల్​ వంటి టెస్టులన్నీ చేశాకే ఈ క్యుపోలా డోమ్​ను ఏర్పాటు చేసింది. ఇక, ఐఎస్​ఎస్​కు ఎలాంటి కమాండ్​ లేకుండానే డాక్​ అయ్యే అటానమస్​ ఫీచర్​ను క్రూ క్యాప్సూల్​నుంచి తీసేసింది.

Tagged Mission, spacex, , space tour, Inspiration4

Latest Videos

Subscribe Now

More News