
హసన్ పర్తి,వెలుగు : హనుమకొండ జిల్లా భీమారంలో ముగ్గురు ఫేక్ డాక్టర్లపై కాకతీయ వర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ డా. డి. లాలయ్య కుమార్, చైర్మన్ డా. కె. మహేశ్‌కుమార్ ఆధ్వర్యంలో టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా. వి. నరేశ్‌కుమార్ టీమ్ ఇటీవల దాడులు చేసి.. సిరి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ నిర్వాహకుడు బి. కృష్ణ ప్రసాద్(ల్యాబ్ టెక్నీషియన్), శ్రీ బాలాజీ క్లినిక్ నిర్వాహకుడు ఆర్. శ్రీకాంత్(ల్యాబ్ టెక్నీషియన్), జవహర్ నగర్ కు చెందిన మై హెల్త్ ఆస్పత్రి నిర్వాహకుడు కె. శరత్ కుమార్( ప్రభుత్వ ఉద్యోగి)ని ఫేక్ డాక్టర్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ లేకుండా వైద్య సేవలు అందించడం చట్ట విరుద్ధమని కమిటీ చైర్మన్ నరేశ్ కుమార్ పేర్కొన్నారు.