ఈ సీజన్ లో ఇమ్యూనిటీని పెంచే ఫ్రూట్స్ ఇవే..!

ఈ సీజన్ లో ఇమ్యూనిటీని పెంచే ఫ్రూట్స్ ఇవే..!
వింటర్ సీజన్ లో చలి నుంచి మన చర్మాన్ని ఎలా కాపాడుకుంటామో.., వైరస్, బ్యాక్టీరియాల నుంచి శరీరాన్ని కాపాడుకోవాలి. అలా కాపాడుకోవాలంటే మన శరీరానికి ఇమ్యూనిటీ పవర్ చాలా అవసరం. అయితే ఇప్పుడు మనం ఎలాంటి పుడ్ తీసుకుంటే మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందో తెలుసుకుందాం. వింటర్ సీజన్ లో ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆహార పదార్ధాలు ఇలా ఉన్నాయి. వాటిలో బాదం: బాదంలో మెగ్నీషియం, ప్రోటీన్, రిబోఫ్లేవిన్, జింక్ తో పాటు 15పోషకాలు ఉన్నాయి.  వీటితో పాటు విటమిన్ – ఇ అధికంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ పనితీరుకు సాయం చేసే యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. విటమిన్- ఇ వైరస్ మరియు బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. అటువంటి బాదాన్ని  రోజులో ఎప్పుడైనా, ఎక్కడైనా తినగలిగే చిరుతిండిగా ఉపయోగపడుతుంది. ఆహారంలో కూడా బాదం పప్పును వినియోగించుకోవచ్చు. దీంతో పాటు  ఆరోగ్యకరమైన, ఇంకా రుచికరమైన స్నాక్స్ తయారు చేసేందుకు ఈ బాదం పప్పు ఉపయోగపడుతుంది. అల్లం : అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ  లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టే మన శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ పవర్  బ్యాక్టీరియా,  వైరస్ ల నుంచి కాపాడేందుకు సహాయపడుతుంది. ప్రతీ రోజు ఉదయానే ఖాళీ కడుపుతో అల్లం టీ లేదా అల్లంతో చేసిన మిశ్రమాన్ని ఉదయం తినడం వల్ల అనేక వ్యాధులు దూరంగా ఉండవచ్చు. వ్యాధి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.  పుల్లటి పదార్ధాలు : విటమిన్ – సి  మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచి సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది.   దాదాపు పుల్లగా ఉండే పండ్లు నారింజ, నిమ్మకాయలు, కివీ  మరియు గువాస్‌తో సహా విటమిన్ సి అధికంగా ఉంటుంది. వింటర్ సీజన్ లో ఈ సిట్రస్ పండ్లు పండుతాయి కాబట్టి ప్రతీ ఒక్కరూ ఈ పండ్లను తినొచ్చు.