కారంపొడి చల్లి.. గొడ్డళ్లతో నరికి.. ముగ్గురి హత్య

కారంపొడి చల్లి.. గొడ్డళ్లతో నరికి.. ముగ్గురి హత్య
  • పాలొల్ల మధ్య భూ తగాదాలే కారణం
  • తండ్రి, ఇద్దరు కొడుకుల మృతి
  • తప్పించుకున్న రెండో కొడుకు

జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి/కాటారం, వెలుగు: భూ తగాదాలతో ముగ్గురిని పట్టపగలు చేను వద్ద నరికి చంపిన ఘటన జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామంలో జరిగింది. గంగారం గ్రామానికి చెందిన లావుడ్య మంజినాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సమ్మయ్య, మహంకాళి, రాంజ్య నాయక్‌‌‌‌‌‌‌‌ అన్నదమ్ములు. వీరిలో రాంజ్య నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చనిపోయారు. గ్రామంలోని 396 సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌లో గల ‌‌‌‌‌‌‌‌ జంగు సిపాయిలకు చెందిన 24 ఎకరాల భూమి విషయమై అన్నదమ్ములు, వీరి కుటుంబాల మధ్య చాలా ఏండ్లుగా తగాదా నడుస్తోంది. మంజి నాయక్‌‌‌‌‌‌‌‌, బికిని దంపతులు గంగారంలో ఉంటుండగా పెద్ద కొడుకు లావుడ్య సారయ్య భూపాలపల్లిలో, రెండో కొడుకు సమ్మయ్య గోదావరిఖనిలో, మూడో కొడుకు భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాటారంలో కుటుంబాలతో ఉంటున్నారు. మంజినాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు వేర్వేరు గ్రామాల్లో నివసిస్తున్న అతని ముగ్గురు కొడుకులు శనివారం ఉదయం పత్తి గింజలు పెట్టడానికి వాళ్ల వ్యవసాయ భూమి వద్దకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో సమ్మయ్య, మహంకాళి, రాంజ్య కుటుంబాలకు చెందిన 9 మంది ఎడ్లబండిపై అక్కడికి చేరుకున్నారు. అక్కడ మాటా మాటా పెరగడంతో వారంతా ఒకేసారి మంజునాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అతని కొడుకులపై దాడి చేశారు. వారి వెంట తెచ్చుకున్న కారం పొడిని కంట్లో చల్లి గొడ్డళ్లు, కొడవళ్లతో తల, మెడ, చాతిలో పొడిచారు. దాడిలో మంజినాయక్‌‌‌‌‌‌‌‌(70 )‌‌‌‌‌‌‌‌, అతని పెద్ద కొడుకు సారయ్య(48), చిన్న కొడుకు భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(38) అక్కడికక్కడే చనిపోగా రెండో కొడుకు సమ్మయ్య గాయాలతో తప్పించుకున్నాడు. భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. లావుడ్య మహంకాళి,  ఆయన భార్య కౌసల్య, పెద్ద కొడుకు భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెండో కొడుకు బాబు నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మూడో కొడుకు సర్ధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలియాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సమ్మయ్య కుటుంబానికి చెందిన సమ్మయ్య కొడుకులు సారయ్య, బాబు, రాంజ్య నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొడుకు సమ్మయ్య, సమ్మయ్య బామ్మర్ది ఈ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లుగా దాడిలో గాయపడిన మంజినాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండో కొడుకు సమ్మయ్య కాటారం పోలీసులకు కంప్లైంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. నిందితులంతా పరారీలో ఉన్నారు.

రెవెన్యూతో పాటు పోలీసుల వైఫల్యం
మంజినాయక్ అతని ఇద్దరు కొడుకుల హత్యకేసులో రెవెన్యూతో పాటు పోలీసుల వైఫల్యం ఉన్నదని బంధువులు ఆరోపిస్తున్నారు. పదేండ్లుగా భూతగాదా ఉందని, 2017 జూన్​లో మంజినాయక్ పై హత్యా యత్నం చేశారని చెప్పారు. 3 రోజుల కింద కాటారం పోలీస్ స్టేషన్ లో ప్రాణభయం ఉన్నదని కంప్లైంట్ చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. రెవెన్యూ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ వారు భూమిని గతంలో మంజినాయక్ తోపాటు అతని ప్రత్యర్థులకు కూడా పట్టా చేశారని, గొడవలకు అది కూడా కారణమని పేర్కొంటున్నారు.