TSPSC పేపర్ లీకేజ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్

TSPSC పేపర్ లీకేజ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్ : TSPSC పేపర్ లీకేజ్ కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. TSPSCలో పని చేస్తున్న రమేష్ కుమార్, శమీమ్, సురేష్ లను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు నిందితులు సైతం గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి 100కి పైగా మార్కులు పొందినట్లు విచారణలో గుర్తించారు సిట్ అధికారులు. పేపర్ లీకేజ్ ద్వారానే ఈ ముగ్గురు ఎగ్జామ్ రాశారని పోలీసులు చెబుతున్నారు. TSPSCలో పనిచేసే 26 మంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాయగా.. వారిలో 8 మంది క్వాలిఫై అయ్యారని గుర్తించారు. TSPSCలో పని చేస్తున్న 30 మందికి ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అనుమానితులందరినీ విచారించి.. వారి పాత్రపైనా ఆరా తీయనున్నారు. 

మార్చి 23వ తేదీన మరోసారి సిట్ విచారణకు కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మి హాజరుకానున్నారు. మరోవైపు.. 9 మంది నిందితులకు మార్చి 23వ తేదీతో కస్టడీ విచారణ ముగియనుంది. మరోసారి కస్టడీకి తీసుకోవడానికి కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ వేయనున్నారు. మరోవైపు మార్చి 23న సిట్ ముందు హాజరై ఆధారాలు సమర్పించాలని ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.