ఐపీఎల్లో ఆడనున్న పాక్ ఆటగాళ్లు

ఐపీఎల్లో ఆడనున్న పాక్ ఆటగాళ్లు

ఐపీఎల్... వరల్డ్ మోస్ట్ ఎనర్జిటిక్ క్రికెట్ లీగ్. ఈ లీగ్ లో ఆడాలనేది ప్రతీ ఒక్క క్రికెటర్ కల. డబ్బులకు డబ్బులు..అనుభవం కలిగిన క్రికెటర్లతో ఆడటం. దీంతో ఐపీఎల్లో ఆడాలని వివిధ దేశాల క్రికెటర్లు ఉత్సాహ పడుతుంటారు. అయితే ఇప్పటి అన్ని దేశాల క్రికెటర్లు ఐపీఎల్లో ఆడారు. అయితే ఐపీఎల్ ఫస్ట్ సీజన్‌లో మాత్రమే పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత  కొన్ని  కారణాల వల్ల  పాక్ ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరమయ్యారు. దీంతో ఐపీఎల్‌కు ప్రత్యామ్నాయంగా పాక్ ..పాకిస్తాన్ సూపర్ లీగ్ను స్టార్ట్ చేసింది. దీంతో అప్పటి నుంచి పాక్తో పాటు..విదేశాలకు చెందిన ఆటగాళ్లు కొందరు పాక్ సూపర్ లీగ్లో ఆడుతున్నారు. అయితే ఐపీఎల్ 2023 సీజన్లో   పాక్లో పుట్టిన ముగ్గురు ఆటగాళ్లు  ఆడబోతున్నారు. 


రషీద్ పుట్టింది పాక్ లోనే..

ఇంగ్లండ్  స్పిన్నర్ అదిల్ రషీద్ 2023 ఐపీఎల్ ఆడబోతున్నాడు. అతను  సన్‌రైజర్స్ హైదరాబాద్  తరఫున బరిలో దిగనున్నాడు. అయితే రషీద్ పుట్టింది పాకిస్తాన్లోనే.  కానీ అతను ఇంగ్లండ్‌ టీమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక రషీద్  2022 ఐపీఎల్ వేలంలో పాల్గొన్నా..ఏ జట్టు అతన్ని కొనుగోలు చేయలేదు.  ఈసారి మాత్రం సన్‌రైజర్స్ అతన్ని  రూ.2 కోట్లకు దక్కించుకుంది. జట్టులో స్పిన్నర్ కొరతను తీర్చుకోవడానికి హైదరాబాద్ రషీద్‌ను కొనుగోలు చేసింది. 

సూపర్ కింగ్స్ తరపున మొయిన్ అలీ...

ఇంగ్లాండ్కు చెందిన మరో ప్లేయర్ మొయన్ అలీ..పాక్ మూలాలు కలిగిన క్రికెటర్. అతను చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. రాబోయే ఐపీఎల్లోనూ చెన్నై తరపునే బరిలోకి దిగనున్నాడు. ఇప్పటికే అతను ఎన్నో సార్లు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు ఆడాడు. బ్యాట్తోనే కాదు..బంతితోనూ మొయిన్ అలీ రాణించాడు. అందుకే చెన్నై అతన్ని వేలానికి ముందే రిటైన్ చేసుకుంది. 

పాక్లో జన్మించిన జింబాబ్వే ఆల్ రౌండర్

జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అతని ప్రదర్శన టెస్టుల్లో, వన్డేల్లో, టీ20ల్లో ఆమోఘం. ఇంత అద్భుతంగా రాణిస్తున్నాడు కాబట్టే..అతన్ని పంజాబ్ జట్టు కొనుగోలు చేసింది. అయితే సికందర్ రజా కూడా పాకిస్తాన్లోనే పుట్టాడు. అయితే అతను జింబాబ్వేకు ఆడుతున్నాడు. ఇక రీసెంట్గా జరిగిన ఐపీఎల్ వేలంలో సికందర్ రజాను పంజాబ్ జట్టు రూ. 50 లక్షలకు దక్కించుకుంది. దీంతో అతను వచ్చే ఏడాది ఐపీఎల్ అరంగేట్రం చేయబోతున్నాడు.