ఫ్రాన్స్ జట్టులోని ముగ్గురు ఆటగాళ్లకు వైరల్ ఫీవర్..ఫైనల్కు దూరం

ఫ్రాన్స్ జట్టులోని ముగ్గురు ఆటగాళ్లకు వైరల్ ఫీవర్..ఫైనల్కు దూరం

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ ముంగిట డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్కు షాక్ తగిలింది. ఆదివారం అర్జెంటీనాతో ఫైనల్ మ్యాచ్ ఉండగా..జట్టులోని ముగ్గురు కీలక ఆటగాళ్లు ఆనారోగ్యం పాలయ్యారు. దీంతో తుది సమరానికి ఈ ముగ్గురు ప్లేయర్లు దూరమయ్యారు.  రఫేల్ వారానే, ఇబ్రహీం కొనాటే, కింగ్స్‌లీ కొమన్ లలో  వైరల్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. దీంతో ముగ్గురూ ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనలేదు.  దీంతో ఆ జట్టు అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

 రఫేల్ వారానే, ఇబ్రహీం కొనాటే, కింగ్స్‌లీ కొమన్  ముగ్గురు ప్లేయర్లు స్వల్ప వైరల్‌ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారని ఫ్రెంచ్ ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రకటించింది. అందుకే  ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొనలేదని పేర్కొంది. కొనాటే సెమీస్ మ్యాచ్‌కు కూడా దూరం కావడంతో.. ఫ్రాన్స్ ..అతడి స్థానంలో డయోట్ పామెకానోను తీసుకొంది. మరోవైపు ఫ్రాన్స్ జట్టులోని ముగ్గురు ప్లేయర్లకు కొద్దిపాటి జ్వరం లక్షణాలే ఉన్నాయని ఫ్రాన్స్‌ ఫార్వర్డ్‌ ఆటగాడు రాన్‌డల్ కోలో మౌని తెలిపాడు.  ఇవేవీ తీవ్రమైనవి కావన్నాడు. త్వరగా కోలుకొని జట్టులోకి వస్తారనే ఆశిస్తున్నట్లు అని వెల్లడించాడు. 

ఫిఫా వరల్డ్ కప్  2022 చివరి అంకానికి చేరుకుంది. సెమీస్ లో అద్భుతమైన ఆటతీరుతో అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు ఫైనల్ చేరాయి. అటు సెమీస్ లో ఓడిన క్రొయేషియా, మొరాకో మూడో స్థానం కోసం పోటీపడుతున్నాయి. అటు అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య  ఆదివారం రాత్రి 8.30 గంటలకు ఫైనల్ జరగనుంది.