లింగంపేటలో మూడు ఇసుక ట్రాక్టర్ల సీజ్

లింగంపేటలో మూడు ఇసుక ట్రాక్టర్ల సీజ్

లింగంపేట,వెలుగు: లింగంపేట పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను ఆదివారం పట్టుకుని  సీజ్​ చేసినట్లు ఎస్ఐ దీపక్​కుమార్​తెలిపారు. మండలంలోని పర్మల్ల గ్రామ శివారులోని పెద్దవాగు నుంచి లింగంపేటకు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను, లింగంపేట సమీపంలోని పెద్దవాగు నుంచి ఇసుకను తరలిస్తున్న ఒక ట్రాక్టర్​ను సీజ్​ చేసినట్లు చెప్పా రు. ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండా ఇసుకను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.