
ప్రతిరోజూ షూటింగ్స్‌తో బిజీగా ఉండే స్టార్స్ చిన్న గ్యాప్ దొరికితే ఫ్యామిలీతో కలిసి గడపాలనుకుంటారు. అందుకోసం ఫారిన్ ట్రిప్స్ వేస్తుంటారు. అలాగే ఎన్టీఆర్ కూడా ప్రతి ఏడాది తన ఫ్యామిలీతో కలిసి ఏదో ఒక వెకేషన్ ప్లాన్ చేస్తుంటాడు. మే 20న తన బర్త్‌డే వస్తుండటంతో ఇప్పుడు తన భార్య లక్ష్మి ప్రణతితో కలిసి దుబాయ్ వెళ్లాడు. వీరిద్దరూ ఎయిర్ పోర్టులో ఉన్న వీడియో వైరల్ అవుతోంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’తో పాటు హిందీలో ‘వార్2’ చిత్రంలో నటిస్తున్నాడు. తన బర్త్‌డే సందర్భంగా ఈ రెండు చిత్రాల నుంచి క్రేజీ అప్‌డేట్స్‌ను సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ‘దేవర’ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
అలాగే ‘వార్2’ నుంచి కూడా స్పెషల్ గ్లింప్స్‌ను రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ‘దేవర’ అక్టోబర్ 10న విడుదలవుతుంటే, ‘వార్2’ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.