ఉద్యమకారులను వేరే పార్టీల్లోకి పంపేందుకు టీఆర్ఎస్ ప్యాకేజీ తీసుకుందా?

ఉద్యమకారులను వేరే పార్టీల్లోకి పంపేందుకు టీఆర్ఎస్ ప్యాకేజీ తీసుకుందా?

త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయో తెలుసుకోవాలని కరీంనగర్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ అన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీరిందా అని ఆమె ప్రశ్నించారు. తనకు పార్టీ మారే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆమె కరీంనగర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

‘ఎంతోమంది ప్రాణాల బలిదానం తెచ్చుకున్న తెలంగాణలో వనరుల వినియోగం సజావుగా సాగుతుందా? ప్రాణాలు పణంగా పెట్టి సాధించుకున్న తెలంగాణ ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. సకల జనుల వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కొంతమంది కోసమే తెలంగాణ రాష్ట్రం రాలేదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ నిర్మాణం జరుగుతుందా అని ఆలోచించుకోవాలి. నిజమైన ఉద్యమ కారులను ఇతర పార్టీలకు పంపేందుకు టీఆర్ఎస్ ఏమైనా ప్యాకేజీ మాట్లాడుకుందేమో తెలియడంలేదు’ అని ఆమె అన్నారు.