అమృత్‌‌సర్‌‌లో టిఫిన్ బాక్స్ బాంబ్

అమృత్‌‌సర్‌‌లో టిఫిన్ బాక్స్ బాంబ్
  • పాక్ నుంచి డ్రోన్ ద్వారా జారవిడిచినట్లు అనుమానం

చండీగఢ్: పంజాబ్​లో టిఫిన్ బాక్స్ బాంబ్ కలకలం సృష్టించింది. పాక్ బార్డర్ వెంబడి అమృత్​సర్​కు దగ్గర్లోని ధాలికే గ్రామంలో ఈ బాంబ్ పోలీసులకు దొరికింది. ‘‘ధాలికే గ్రామంలో ఆదివారం సాయంత్రం ఓ బ్యాగు ను గుర్తించాం. అందులో ఐఈడీ ఉన్న టిఫిన్ బాక్స్, 5 హ్యాండ్ గ్రెనేడ్స్, 100 రౌండ్ల 9ఎంఎం పిస్టల్ బుల్లెట్స్ ఉన్నాయి” అని డీజీపీ దిన్​కర్ గుప్తా తెలిపారు. ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్​లో ఫోమ్ ప్యాకింగ్ ద్వారా బాంబును పిక్స్ చేశారని చెప్పారు. అందులో దాదాపు 3 కిలోల ఆర్డీఎక్స్ ఉంటుందని ఎన్ఎస్​జీ అంచనా వేసిందన్నారు. ఈ బ్యాగును పాకిస్తాన్ నుంచి డ్రోన్ ద్వారా మన బార్డర్​లో జారవిడిచినట్లు అనుమానిస్తున్నట్లు చెప్పారు.