జెట్ స్పీడులో ‘టైగర్‌‌‌‌ నాగేశ్వరరావు’ షూటింగ్‌‌

జెట్ స్పీడులో ‘టైగర్‌‌‌‌ నాగేశ్వరరావు’ షూటింగ్‌‌

‘ధమాకా’తో మరో సక్సెస్‌‌ అందుకున్న రవితేజ.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తను హీరోగా నటిస్తున్న నెక్స్ట్ మూవీ ‘రావణాసుర’ ఏప్రిల్‌‌లో రిలీజ్ కానుంది. మరోవైపు ‘టైగర్‌‌‌‌ నాగేశ్వరరావు’ షూటింగ్‌‌ని కూడా జెట్ స్పీడులో కానిచ్చేస్తున్నాడు రవితేజ. వంశీకృష్ణ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ మూవీ గురించి కొత్త అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.  నైట్‌‌ షెడ్యూల్‌‌లో లార్జ్‌‌ అండ్ లావిష్‌‌గా యాక్షన్ సీక్వెన్సులు తీస్తున్నామని, సినిమాకు ఈ సీన్స్‌‌ హైలైట్ అవుతాయని చెబుతూ.. ఓ వీడియోను విడుదల చేశారు. 

అంతేకాదు.. అతి త్వరలో ఫస్ట్ లుక్‌‌ను రిలీజ్‌‌ చేయబోతున్నట్టు ప్రకటించారు. స్టువర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవితం పీరియాడిక్‌‌ యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా ఈ సినిమా రూపొందిస్తున్నారు. డెబ్భైల్లో భారీ దొంగతనాలు, దోపిడీలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగే నాగేశ్వరరావుకు ప్రజల్లో రాబిన్‌‌ హుడ్‌‌ తరహా ఇమేజ్‌‌ ఉంది. అతని జీవితాన్ని ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి నెలకొంది. నుపూర్ సనన్ హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రేణుదేశాయ్‌‌, అనుపమ్ ఖేర్‌‌‌‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు.