
వేములవాడరూరల్, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్‌లో పులి కలకలం చెలరేగింది. సోమవారం రాత్రి గ్రామ శివారులోకి పెద్దపులి వచ్చినట్లు ఆ ప్రాంత రైతులు గుర్తించి ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. వారు గ్రామానికి చేరుకొని పులి పాదముద్రలు గుర్తించి, దాని జాడ కోసం గాలింపు చేపట్టారు. మూడు నెలల క్రితం ఇదే ప్రాంతంలో ఓ రైతుకు చెందిన లేగ దూడను పులి చంపేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి పులి తిరుగుతున్నట్లు ప్రచారం జరగడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.