పత్తి చేలల్లోకి పెద్దపులి.. ఆదిలాబాద్ రైతుల్లో ఆందోళన

పత్తి చేలల్లోకి  పెద్దపులి.. ఆదిలాబాద్ రైతుల్లో ఆందోళన

ఆదిలాబాద్​టౌన్​(భీంపూర్​), వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా అడవుల్లో పులి సంచరిస్తుండడంతో అటవీ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శనివారం భీంపూర్​ మండలం గొల్లఘాట్, తాంసి(కె), పిప్పల్​కోటి గ్రామాల సమీపంలోని యల్లా కేశవ్, పాగుల రమేశ్​ పత్తి చేలల్లో పులి కనిపించింది. రెండు రోజుల కింద బోథ్​  మండలంలోని చింతల్​బోరి అటవీ ప్రాంతంలో పులి సంచరించినట్లు అధికారులు గుర్తించారు.

రైతుల సమాచారంతో భీంపూర్​ మండలంలో పులి సంచరించిన ప్రాంతాన్ని అటవీ శాఖ అధికారులు పరిశీలించి, ట్రాకింగ్​ కెమెరాలను ఏర్పాటు చేశారు. తిప్పేశ్వర్​ అటవీ ప్రాంతం నుంచి ఇక్కడికి పులులు వస్తున్నట్లు తెలుస్తోంది. పశువుల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రిపూట రైతులు పొలాల్లోకి వెళ్లవద్దని ఫారెస్ట్​ ఆఫీసర్లు సూచించారు.