టిక్ టాక్ సెలబ్రిటీ దారుణ హత్య

టిక్ టాక్ సెలబ్రిటీ దారుణ హత్య

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. టిక్ టాక్ వీడియోస్ తో ఫేమస్ అయిన మోహిత్ మోర్(27) అనే యువకుడిని ముగ్గురు దుండగులు దారుణంగా హత్య చేశారు. మంగళవారం సాయంత్రం 5:15 గం.ల సమయంలో ఈ ఘటన జరిగింది

నగరంలోని నజఫ్‌గఢ్‌ ధర్మపుర ఏరియాలో తన స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిన మోహిత్ ను దుండగులు తుపాకీలతో కాల్చి చంపారని పోలీస్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. తన స్నేహితుడికి సంబంధించిన ఫోటో షాప్ లో అతనితో మాట్లాడుతుండగా.. ముగ్గరు వ్యక్తులు తుపాకీలతో బుల్లెట్ల వర్షం కురిపించారని ఆయన అన్నారు. అతని శరీరంలో 13 బుల్లెట్స్ దిగినట్టు అధికారి చెప్పారు. హత్య చేసిన తర్వాత దుండగులు అక్కడి నుంచి పారిపోయినట్లు సీసీ కెమెరాలో నమోదయిందని ఆయన తెలిపారు.

మోహిత్  టిక్ టాక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో తరుచూ ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తుండేవా‌డు. దాదాపు 5లక్షల మంది ఫాలోవర్లున్న మోహిత్ టిక్ టాక్ సెలబ్రిటీగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇతని హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.