
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్(Kangana Ranaut) నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ "టీకూ వెడ్స్ షేరు(tiku weds sheru )". నవాజుద్దీన్ సిద్ధిఖీ(Nawazuddin Siddiqui) హీరోగా చేస్తున్న ఈ సినిమాలో.. అవనీత్ కౌర్(Avneet Kaur) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ జూన్ 23న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ మూవీ నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ ట్రైలర్ లో.. హీరోహీరోయిన్ మధ్య లిప్ లాప్ సీన్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది. 60 ఏళ్ళ వయసున్న హీరో.. 20 ప్లస్ హీరోయిన్లతో రొమాన్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విమర్శలపై తాజాగా నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ స్పందించాడు.. "ఏజ్ గ్యాప్ ఉన్న హీరోహీరోయిన్లు రొమాన్స్ చేయకూడదా? అసలు రొమాన్స్‌కి వయసుతో సంబంధం ఏంటి? కింగ్ ఆఫ్ రొమాన్స్‌గా పేరున్న షారుక్ ఖాన్ ఇప్పటికీ రొమాంటిక్ రోల్స్ చేస్తున్నారుగా. ఆయనతో పోల్చుకుంటే యంగ్ హీరోలు కూడా అలా చేయలేకపోతున్నారు. వారంతా రొమాన్స్ తెలియదన్నట్టుగా ప్రవర్తిస్తూ.. అన్నీ వాట్సాప్‌లోనే కానిచ్చేస్తున్నారని" చెప్పుకొచ్చాడు నవాజుద్దీన్.
ప్రస్తుతం నవాజుద్దీన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ట్రైలర్ తోనే ఇంత కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా విడుదల తరువాత ఇంకెన్ని వివాదాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.