హైదరాబాద్ లో ఐపీఎల్ ఆడాలన్నది నా కల: తిలక్ వర్మ

హైదరాబాద్ లో ఐపీఎల్ ఆడాలన్నది నా కల: తిలక్ వర్మ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌16లో అదరగొడుతున్న యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌లో ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌, హైదరాబాదీ తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ ఒకడు. మంగళవారం తొలిసారి సొంతగడ్డ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఆడిన అతను సన్‌‌‌‌‌‌‌‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌పై మెరుపు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌తో  ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో, హోం గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో ఆడాలన్న తన కల నెరవేరిందని తిలక్‌‌‌‌‌‌‌‌ చెప్పాడు. ‘ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ ఆడిన ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్‌‌‌‌‌‌‌‌ చాలా బాగుంది. హోమ్ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో ఆడాలనేది నా కల. బాగా ఆడటమే కాకుండా మా టీమ్‌‌‌‌‌‌‌‌ కూడా గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉన్నా. మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు ముందు నేను చాలా ఉత్సాహంగా ఉన్నా. ముందు రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు’ అని మ్యాచ్‌‌‌‌‌‌‌‌ అనంతరం తిలక్‌‌‌‌‌‌‌‌ తెలిపాడు.

ఏ ప్లేస్‌‌‌‌‌‌‌‌కైనా నేను రెడీ

జట్టు అవసరాలకు తగ్గట్టు ఏ నంబర్‌‌‌‌‌‌‌‌లో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు తాను రెడీగా ఉన్నానని తిలక్​ చెప్పాడు. ‘అన్ని పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేసేందుకు నా గేమ్‌‌‌‌‌‌‌‌పై వర్క్‌‌‌‌‌‌‌‌ చేశాను.  ఎక్కడైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్ చేయగలననే నమ్మకం నాకుందని మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు ఎప్పుడూ చెబుతుంటాను. ఈ విషయంలో వాళ్లు కూడా కాన్ఫిడెంట్‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో పిచ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్లకు కాస్త అనుకూలంగా ఉండటంతో  నేను పేసర్లపై ఎటాక్‌‌‌‌‌‌‌‌ చేశా. నా వెనుక ఇంకా బ్యాటర్లు ఉండటంతో ఒక్క ఓవర్‌‌‌‌‌‌‌‌ కూడా వేస్ట్‌‌‌‌‌‌‌‌ చేయకూడదని అనుకున్నా. అందుకే దూకుడు చూపెట్టా. నేను అనుకున్నట్టుగా ఆడినందుకు హ్యాపీ’ అని తిలక్‌‌‌‌‌‌‌‌ చెప్పుకొచ్చాడు.

క్రికెట్ దేవుడు మా ఇంటికొచ్చాడు

మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు ముందు ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ మెంటార్‌‌‌‌‌‌‌‌ సచిన్‌‌‌‌‌‌‌‌,  ప్లేయర్లను తిలక్‌‌‌‌‌‌‌‌ తన ఇంటికి ఆహ్వానించి డిన్నర్ ఏర్పాటు చేశాడు. ‘క్రికెట్‌‌‌‌‌‌‌‌ దేవుడు (సచిన్‌‌‌‌‌‌‌‌) మా ఇంటికి వచ్చారంటే  ఓ కలలా ఉంది. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా.   నేను పిలవగానే  నా ఫేవరెట్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు రోహిత్‌‌‌‌‌‌‌‌, సూర్య  సహా అందరూ వచ్చారు’ అని హైదరాబాద్​ యంగ్​ స్టర్​ తెలిపాడు.