కరోనాతో టైమ్స్ గ్రూపు చైర్‌పర్స‌న్‌ ఇందూ జైన్ క‌న్నుమూత‌

కరోనాతో టైమ్స్ గ్రూపు చైర్‌పర్స‌న్‌ ఇందూ జైన్ క‌న్నుమూత‌

కరోనా బారిన పడి ఇప్ప‌టికే సామాన్యుల‌తో పాటు వేలాది మంది ప్ర‌ముఖులు చనిపోయారు.ఈ క్రమంలోనే టైమ్స్ గ్రూప్ చైర్ ప‌ర్స‌న్ ఇందూ జైన్ క‌న్నుమూశారు. ఆమె వ‌య‌సు 84 ఏళ్లు. గత కొన్ని రోజుల కిందట ఆమె కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో ఆమెను ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె ప‌రిస్థితి విష‌మించ‌డంతో నిన్న(గురువారం,మే-4) సాయ‌త్రం తుదిశ్వాస విడిచారు. ఇందూ జైన్ మృతి ప‌ట్ల రాజ‌కీయ‌వేత్త‌ల‌తో పాటు ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.

ఇందూ జైన్ మీడియా ప్రపంచంలోనే కాకుండా, అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్యంగా మహిళల హక్కుల కోసం నిరంతరాయంగా పోరాటం చేశారు. సమాజ సేవ పట్ల నిర్విరామంగా శ్రమించారు. ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం.. 2016లో ఆమెను పద్మ విభూషణ్ అవార్డును ప్రదానం చేసి సత్కరించింది. 1999లో ఆమె టైమ్స్ గ్రూపున‌కు చైర్మ‌న్ అయ్యారు. భిన్న‌మైన నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌తో ఆమె ఆక‌ట్టుకున్నారు. టైమ్స్ గ్రూపు అభివృద్ధికి ఆమె ఎంతో కృషి చేశారు. ద టైమ్స్ ఫౌండేష‌న్‌ను ఆమె 2000 సంవ‌త్స‌రంలో ఏర్పాటు చేశారు. తుఫాన్లు, భూకంపాలు, వ‌ర‌ద‌లు, ఇత‌ర సంక్షోభ స‌మ‌యాల్లో టైమ్స్ రిలీఫ్ ఫండ్‌తో ఆమె ఆదుకున్నారు. 2016లో ఆమెకు ప‌ద్మ విభూష‌న్ అంద‌జేశారు. త‌న అవ‌య‌వాలు దానం చేయాల‌న్న‌ది ఆమె జీవితాశ‌యం. అయితే కొవిడ్ ల‌క్ష‌ణాల‌తో మ‌ర‌ణించడంతో ఇందూ జైన్ కోరిక తీర‌లేదు.