Summer Effect: వేడి .. అలసట..ఎండాకాలంలో మోకాళ్ల నొప్పులు.. నరాల తిమ్మిర్లు.. ఎందుకంటే..

Summer Effect: వేడి .. అలసట..ఎండాకాలంలో మోకాళ్ల నొప్పులు.. నరాల తిమ్మిర్లు.. ఎందుకంటే..

ఎండాకాలం వచ్చిదంటే చాలు జనాలు తీవ్రమైన అలసటకు లోనవుతారు.  సమ్మర్​ సీజన్​ భారంగా గడుపుతారు.  ఎండ వేడికి తట్టుకోలేక వృద్దులు.. పిల్లలు  పడే బాధలు అంతా ఇంతా కాదు.  ఓ పక్క నీరసం.. మరో పక్క ఎండ వేడికి అల్లాడిపోతారు.  దీనికి తోడుచలికాలంతో పోలిస్తే ఎండాకాలంలో  కాళ్ల నొప్పులు, నరాల నొప్పులు ఎక్కువుగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  దీంతో ఒక్కో సారి తిమ్మిరి వచ్చి చాలా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది.  

సాధారణంగా పిల్లలు, వృద్దులు, గర్భిణి స్త్రీలలో ఈ నొప్పులు అధికంగా వస్తాయి.  ఎండాకాలం వేడి వల్ల కండరాలు నొప్పులు వస్తాయి.  వీటిని నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి హార్ట్​ స్ట్రోక్​ కూడా వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  పిల్లలకు ఎండాకాలం సెలవులు దాదాపు 45 రోజులపాటు ఇస్తారు.  పెద్ద పెద్ద మైదానాల్లో పిల్లలు ఆడుకునేందుకు ఎక్కువ ఇష్టపడతారు,  ఉష్ణోగ్రత ఎక్కువుగా ఉన్నప్పుడు బయట ఆడటం.. బయట తిరగడం వల్ల కండరాల్లో తిమ్మిర్లు ఏర్పడుతాయి.  అంతేకాకుండా  శరీరంలోని తేమ చెమట ద్వారా బయటకు వచ్చి నిర్జలీకరణం అవుతుంది. 

తిమ్మిర్లు పట్టడం వల్ల ఒళ్ళంతా సూదులతో గుచ్చినట్టుగా ఉంటుంది.నడుస్తున్నప్పుడు భరించలేని మంట కలుగుతుంది.జివ్వుమని లాగేసే ఈ తిమ్మిర్లను నిర్లక్ష్యం చేస్తే నరాల వ్యవస్థ శాశ్వతంగా నాశనమయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. కానీ తరచుగా ఈ సమస్య ఎదురైతే భవిష్యత్ లో విపరీతమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు ఘంటాపథంగా చెబుతున్నారు.

నివారణ చిట్కాలు..

రక్తప్రసరణ సక్రమంగా జరగకపోవడం, సుదీర్ఘకాలం తక్కువ ఉష్ణోగ్రతలలో జీవించడం, థైరాయిడ్ వ్యాధితో బాధపడటం, సక్రమంగా నీళ్లు తాగకపోవడం, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడటం, దీర్ఘకాలంగా మానని గాయలతో ఉండటం, పొటాషియం, మెగ్నీషియం లోపించడం వంటి అనేక రకాల అనారోగ్య సమస్యల కారణంగా తిమ్మిర్లు వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు.రోజూ తీసుకునే ఆహారంలో మెగ్నీషియం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. రోజుకు 10 నుంచి 12 గ్లాసుల నీరు తాగాలి. కొబ్బరి నీళ్ల తోపాటు పోషకాలు అధికంగా లభించే విత్తనాలు, గింజలు తినడం వల్ల శరీరంలో మెగ్నీషియం స్థాయిలను పెంచుకుంటే ఇలాంటి ఇబ్బందులను నివారించవచ్చని చెబుతున్నారు,
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. అవసరమున్న మేరకు విశ్రాంతి తీసుకోండి.  కండరాలను సాగదీస్తూ.. అవకాశం ఉంటే మసాజ్​ చేయండి.  తిమ్మిరి .. కాళ్ల నొప్పులు.. నరాలు గుంజడం లాంటివి ఉంటే వ్యాయామం మానేయండి. 
నిద్రపోతున్నప్పుడు కాళ్లు చేతులు తిమ్మిర్లు వస్తే కండరాలను సాగదీయండి. తిమ్మిరి పట్టిన కాలును నేలపై ఉంచి బరువు పడేలా చూసుకోండి.  వెంటనే తిమ్మిరి తగ్గుతుంది. 
ఒకే చోట గంటల తరబడి నిల్చున్నా, కూర్చున్నా తిమ్మిర్లు పడతాయి.ఇది సాధారణ విషయమే కానీ కొందరికి తిమ్మిరి దీర్ఘకాలిక అనారోగ్య సమస్య అయ్యి వారిని జీవితాంతం బాధిస్తుంటుంది.