
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట పట్టణంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక హై స్కూల్ మైదానం నుంచి మూడు రంగుల జెండాతో పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమానికి హాజరైన మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజల్లో జాతీయ భావం పెంపొందించాలని ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో ప్రతి పట్టణంలో, ప్రతి మండల కేంద్రంలో తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
పార్టీలకు అతీతంగా, కుల, వర్గ, మతాలతో సంబంధం లేకుండా భావి భారత పౌరులైన చిన్నారులకు జాతీయ జెండా ఆవశ్యకతను తిరంగా ర్యాలీ ద్వారా వివరిస్తున్నట్టు ఎంపీ తెలిపారు. ర్యాలీలో జిల్లా బీజెపీ అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్ తో పాటు నాయకులు కె.వేణుగోపాల్, బాసంగారి వెంకట్, రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.