
తిరుమల కొండకు రద్దీ పెరిగింది. వేసవి సెలవుల కారణంగా శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అలిపిరి మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్లే భక్తులకు టీటీడీ మజ్జిగను పంపిణీ చేస్తుంది. ఐదు రోజులుగా ( మే 27 నాటికి) రికార్డ్ స్థాయిలో స్వామిని దర్శించుకున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా టీటీడీ చర్యలు చేపట్టింది.
మెట్ల మార్గంలో నడుచుకుంటే వెళ్లే భక్తులకు ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర భక్తులకు మజ్జిగ పంపిణీ చేస్తోంది. అలిపిరి నడక మార్ సుమారు 9 కిలో మీటర్లు ఉంటుంది. 3,550 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. దీంతో కాలినడకన అలసిపోయి వచ్చిన భక్తులు టిటిడి అందిస్తున్న మజ్జిగ తాగి సేద తీరుతున్నారు.
విజిలెన్స్, ఆలయ విభాగాలు సమన్వయంగా సాధారణ రోజుల్లో కంటే 10వేల మంది వరకు భక్తులకు అదనంగా దర్శనం చేసుకుంటున్నారు.
►ALSO READ | తెలుగు జాతి అభివృద్ధికి టీడీపీ బ్రాండ్ అంబాసిడర్.. సీఎం చంద్రబాబు
గడిచిన ఐదు రోజుల్లో ( మే 27 నాటికి) 4 లక్షల 20 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 12 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదాలు అందించారు. ఇక సోమవారం ( మే 26) ఒక్కరోజే రికార్డు స్థాయిలో 5.09 కోట్ల మేర శ్రీవారి హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు..