
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం ( అక్టోబర్ 11) వీకెండ్ కావడంతో భక్తులు పోటెత్తారు. తమిళనాడు వాసులకు ఎంతో పవిత్రమైన పెరటాసి మాసం.. నాలుగవ శనివారం కావడంతో తమిళనాడు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనానికి సుమారు 7 గంటలు, రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.
తిరుమల భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు ఇబ్బంది పడకుండా టీటీడీ అధికారులు తీసుకుంటున్నారు.శ్రీవారి సేవకుల ద్వారా భక్తలకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు..
ఇక తిరుమల శ్రీవారిని నసాయంత్రం న్న 74,468 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,878 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.86 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు