
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తిరుమల నుంచి పాప వినాశనం మార్గంలో అటవీ ప్రాంతంలో మంటలు భారీ ఎత్తున ఎగిసి పడ్డాయి. వెంటనే గుర్తించిన టీటీడీ ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమై మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
తిరుమల మండిపోతోంది. వెంకన్న కొండల్లోని శేషాచలం అడవులు తగలడి పోతున్నాయి. అడవుల్లో అగ్ని ప్రమాదం జరిగి మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. అదుపు చేసేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎక్కడా అదుపు అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
ఫైర్ ఇంజన్లు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో టీటీడీ.. అటవీశాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్నమయ్య మార్గం .. అటవీ ప్రాంతం కావడంతో ఫైర్ ఇంజన్లు వెళ్లలేకపోవడంతోనే మంటలను అదుపు చేయలేక పోతున్నామని అటవీ సిబ్బంది చెబుతున్నారు. పాపవినాశనం డ్యాం నుంచి అన్నమయ్య నడక మార్గంలో కొండలపై భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఇవి మరింత ఎక్కువ అవుతాయని .. కుమారధార, పసుపుధార వైపు మంటలు వ్యాపించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
►ALSO READ | తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. కొత్తగా వాట్సప్ ఫీడ్ బ్యాక్ విధానం.. సమస్య ఏంటో నేరుగా చెప్పొచ్చు..!