ఓం నమో వేంకటేశాయ : శ్రీవారి దర్శనానికి 35 గంటలు

ఓం నమో వేంకటేశాయ :  శ్రీవారి దర్శనానికి 35 గంటలు

కలియుగ ప్రత్యేక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చెంత భక్తులు బారులు తీరారు. తిరుమలలో భక్తుల రద్దీ కంటిన్యూ అవుతోంది. వీకెండ్, వరుస సెలవులు రావడంతో దేశ నలుమూల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయ్యాయి.

 నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లు  భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీ పెరగడంతో శ్రీవారి ఉచిత దర్శనానికి 35 గంటలు సమయం.. టైమ్ స్లాట్ దర్శనానికి 7 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడతోంది.