టిటాస్‌‌‌‌ తడాఖా..ఫైనల్లో సంచలన బౌలింగ్

టిటాస్‌‌‌‌ తడాఖా..ఫైనల్లో సంచలన బౌలింగ్

యంగ్‌‌‌‌ పేసర్‌‌‌‌ టిటాస్‌‌‌‌ సాధు (4–1–6–3) సెన్సేషనల్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌తో ఇండియా విమెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌కు సింగిల్‌‌‌‌ హ్యాండ్‌‌‌‌తో గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ అందించింది. ఫేవరెట్‌‌‌‌గా బరిలోకి దిగిన ఇండియా ఆదివారం జరిగిన ఫైనల్లో 19 రన్స్‌‌‌‌ తేడాతో శ్రీలంకను ఓడించి చాంపియన్‌‌‌‌గా నిలిచింది. బ్యాటింగ్‌‌‌‌కు ఏమాత్రం సహకరించని పిచ్‌‌‌‌పై కెప్టెన్‌‌‌‌ హర్మన్‌‌‌‌ ప్రీత్‌‌‌‌ కౌర్‌‌‌‌ టాస్‌‌‌‌ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకోగా ఇండియా 20 ఓవర్లలో 116/7 స్కోరు చేసింది. ఓపెనర్‌‌‌‌ షెఫాలీ (9), రిచా ఘోశ్‌‌‌‌ (9), కెప్టెన్‌‌‌‌ హర్మన్‌‌‌‌ (2) ఫెయిలైనా మరో ఓపెనర్‌‌‌‌  ఓపెనర్‌‌‌‌ స్మృతి మంధాన (45 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 46), జెమీమా రోడ్రిగ్స్‌‌‌‌ (40 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లతో 42) సత్తా చాటారు. అనంతరం  ఛేజింగ్‌‌‌‌లో లంక ఓవర్లన్నీ ఆడి 97/8 స్కోరు మాత్రమే చేసింది. 19 ఏండ్ల టిటాస్‌‌‌‌ తొలి స్పెల్‌‌‌‌లో లంక బ్యాటర్లను వణికించింది. వరుస ఓవర్లలో లంక కెప్టెన్‌‌‌‌ చామరి ఆటపట్టు (12)తో పాటు అనుష్క (1), విష్మి (0)లను ఔట్‌‌‌‌ చేసి దెబ్బకొట్టింది. హాసిని పెరెరా (25), నీలాక్షి (23), ఒషాడి (19) కాసేపు ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. రాజేశ్వరి గైక్వాడ్‌‌‌‌ (2/20) రెండు వికెట్లు పడగొట్టగా.. దేవికా వైద్యా (1/15) పొదుపుగా బౌలింగ్‌‌‌‌ చేయడంతో లంక కనీసం వంద రన్స్​ మార్కును కూడా అందుకోలేకపోయింది.

నేటి మెయిన్​ ఈవెంట్స్​

మెన్స్​ హాకీ (ఇండియాx సింగపూర్​): ఉ. 6.30 నుంచి
షూటింగ్​ (10 మీ. ఎయిర్​ రైఫిల్​ మిక్స్​డ్​ టీమ్​, విమెన్స్​ 25 మీ. పిస్టల్​, మెన్స్​ స్కీట్) ఉ. 6.30 నుంచి
ఫెన్సింగ్​ (భవానీ దేవి) ఉ. 6.30
మెన్స్​ బాక్సింగ్​ (సచిన్​, నరేంద్ర బౌట్స్​) మ. 12.30 నుంచి
ఉషు (క్వార్టర్ ఫైనల్స్​) సా. 5 నుంచి