ఫార్మా సిటీ నుంచి వచ్చేదంతా విషమే

ఫార్మా సిటీ నుంచి వచ్చేదంతా విషమే

ఫార్మా సిటీ నుంచి వచ్చేదంతా విషమే

యాచారం, వెలుగు : ఫార్మా సిటీ నుంచి బయటకి వచ్చేదంతా విషమేనని, ఆ విషం మనకొద్దని టీజేఎస్‌ చీఫ్‌ కోదండరాం అన్నారు. ఆదివారం ఫార్మా సిటీకి వ్యతిరేకంగా ఫార్మా బాధితులు, ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట సమితి చేపట్టిన ప్రజా యాత్ర రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి, కుర్మిద్ద, మంథన్ గౌరెల్లి, మాల్‌లో జరిగింది. ఫార్మా సిటీతో కలుషితమయ్యే చెరువులు, కుంటలను సందర్శిస్తూ ప్రజాయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో కోదండరాం మాట్లాడారు. 

ఫార్మా సిటీతో ఈ ప్రాంతమే విషపూరితమయ్యే ప్రమాదముందని తెలిపారు. ఫార్మాసిటీ వ్యతిరేక ఉద్యమానికి తన పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. ఫార్మా సిటీతో ఈ ప్రాంతమే ప్రమాదంలో పడనుందని హెచ్చరించారు. ఇక్కడి గ్రామాల్లో భూములు పోయి.. కంపెనీలు వస్తే మనం అడుక్కు తినాల్సిన పరిస్థితి తలెత్తుతుందన్నారు. మన భూములు ఇవ్వొద్దని, ఆ కంపెనీలు మనకొద్దన్నారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత కోదండ రెడ్డి, టీజేఎస్‌ కార్యదర్శి ఆశప్ప తదితరులు పాల్గొన్నారు.