
హైదరాబాద్, వెలుగు: టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రెసిడెంట్ మామిళ్ల రాజేందర్ బీఆర్ఎస్ లో చేరనున్నారు. శుక్రవారం ఆయన సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో జాయిన్ అవ్వనున్నారు. ఇప్పటికే తాను వీఆర్ఎస్ కు అప్లై చేసుకున్నానని.. అది శుక్రవారం ఆమోదం పొందనుందని రాజేందర్ వెలుగుకు తెలిపారు. రాజేందర్ రిజైన్ తో టీఎన్జీవో కేంద్ర సంఘం కొత్త ప్రెసిడెంట్ ఎన్నిక కోసం గురువారం రాష్ర్ట కార్యవర్గ సమావేశం జరగనుంది.
ఈ మీటింగ్ కు 33 జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కేంద్ర సంఘం నేతలు హాజరుకానున్నారు. సంగారెడ్డికి చెందిన మామిళ్ల రాజేందర్ రంగారెడ్డి డీఎంహెచ్ వో కార్యాలయంలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు. ఇంకా 3 ఏళ్ల సర్వీస్ ఉన్నా వీఆర్ఎస్ తీసుకుంటున్నారు. కాగా.. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడిగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ ముందున్నట్లు నేతలు చెబుతున్నారు.