Prabhas,Amitabh: మీతో కలిసి నటించడం గొప్ప గౌరవం.. బిగ్ బీ అమితాబ్కు ప్రభాస్ బర్త్ డే విషెస్

Prabhas,Amitabh: మీతో కలిసి నటించడం గొప్ప గౌరవం.. బిగ్ బీ అమితాబ్కు ప్రభాస్ బర్త్ డే విషెస్

ఇండియన్ సినిమా చరిత్రలోని గొప్ప వ్యక్తులలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒకరు. ఈ బాలీవుడ్ మెగాస్టార్ తనదైన నటనతో సినీ రంగాన్ని శాసించే రారాజుగా ఎదిగి కళామతల్లికి వన్నె తెచ్చారు. ఈ దిగ్గజ నటుడి పుట్టినరోజు నేడు. 1942లో జన్మించిన అమితాబ్, నేటితో (11 October 2025) 83 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా దేశ సినీ చిత్ర పరిశ్రమ అంతటా బర్త్ డే విషెష్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులుపెడుతున్నారు.

ఈ క్రమంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, బిగ్ బి అమితాబ్ పై ప్రేమను వ్యక్తపరుస్తూ విషెష్ తెలిపారు. ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు అమితాబ్ బచ్చన్ సర్. మీ విలక్షణ నట విశ్వరూపాన్ని చూడటం మరియు మీతో కలిసి పనిచేయడం ఒక గొప్ప గౌరవం’’ అని ప్రభాస్ ఇన్ స్టాలో నోట్ రాశారు.

అలాగే కల్కి మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి, మా అశ్వత్థామకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని తెలిపారు. ‘‘ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఒకే ఒక్క అమితాబ్ బచ్చన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. మీతో కలిసి పనిచేయడం గొప్ప గౌరవం. మీ అచంచలమైన అంకితభావం, దయ మరియు సెట్‌లో మీ ఉనికి ప్రతిరోజూ మాలో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుంది. మీరు త్వరలో మాతో కల్కి 2తో తిరిగి రావాలని మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని మేకర్స్ ట్వీట్ చేశారు.

అమితాబ్ టాలీవుడ్లో చివరగా 'కల్కి 2898 AD' లో ప్రభాస్తో కలిసి నటించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో ప్రభాస్ భైరవ పాత్రను పోషించగా, అమితాబ్ అశ్వత్థామ పాత్రలో నటించారు. ఈ సినిమాలో బిగ్ బి పవర్ ఫుల్ నటనకు థియేటర్స్లో విజిల్స్ పడ్డాయి. 2026లో కల్కి2తో ఈ దిగ్గజ నటులు మరోసారి ఆడియన్స్ ముందుకు రానున్నారు.

►ALSO READ |  AA22xA6: ఆడియన్స్ కొత్త ప్రపంచాన్ని చూస్తారు.. అల్లు అర్జున్ మూవీపై అట్లీ ఇంట్రెస్టింగ్ అప్డేట్