కరెంటు బండ్లే కావాలె.. 2027 నాటికి డీజిల్​ కార్లు బంద్​

కరెంటు బండ్లే కావాలె.. 2027 నాటికి డీజిల్​ కార్లు బంద్​
  • కరెంటు బండ్లే కావాలె

  • 2027 నాటికి డీజిల్​ కార్లు బంద్​

  • బ్యాన్​ చేయాలని సూచించిన ఆయిల్​ మినిస్ట్రీ  

  • డీజిల్​ సిటీ బస్సులు కూడా వద్దని స్పష్టీకరణ

  • వీటిని బ్యాటరీ బస్సులుగా మార్చాలని సిఫార్సు

న్యూఢిల్లీ : కాలుష్యాన్ని, హానికర వాయువులను తగ్గించేందుకు  డీజిల్ ఫోర్- వీలర్ వెహికల్స్​పై నిషేధం విధించాలని భారత చమురు మంత్రిత్వ శాఖ సూచించింది. నగరాల్లో 2027 నాటికి డీజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నడిచే ఫోర్ -వీలర్ వెహికల్స్​ వినియోగాన్ని నిషేధించాలని ఈ మంత్రిత్వశాఖ నియమించిన ఎక్స్​పర్టుల ప్యానెల్​  సిఫార్సు చేసింది.  విషవాయువులను తగ్గించడానికి నగరాల్లో పది లక్షలకు పైగా జనాభా ఎలక్ట్రిసిటీ,  గ్యాస్ ఇంధనంతో నడిచే వెహికల్స్​కు మారాలి.

2030 నాటికి సిటీల్లో డీజిల్​ బస్సులను అనుమతించకూడదు. 2024 నుండి నగర రవాణా కోసం డీజిల్ బస్సులను వాడకూడదు. గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్  వాయువులను అత్యధికంగా విడుదల చేసే దేశాలలో ఒకటైన భారతదేశం,  2070 నాటికి నెట్ ​జోరో లక్ష్యాన్ని సాధించడానికి  రెన్యువబుల్​ ఎనర్జీని పెద్ద ఎత్తున తయారు చేయాలని అనుకుంటోంది. మొత్తం కరెంటులో 40 శాతం వాటా సోలార్​, విండ్​, హైడ్రోజన్​ నుంచి ఉండాలని కోరుకుంటోంది.  

చమురు శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్ నాయకత్వంలోని ఎనర్జీ ట్రాన్సిషన్​ అడ్వైజరీ కమిటీ ఈ సిఫార్సులను చేసింది. వీటిని అమలు చేయడానికి పెట్రోలియం మంత్రిత్వ శాఖ క్యాబినెట్ ఆమోదం కోరుతుందా లేదా ? అనేది స్పష్టంగా తెలియలేదు. దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్​ వినియోగాన్ని పెంచేందుకు, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ స్కీమ్ (ఫేమ్​) కింద ఇచ్చిన ప్రోత్సాహకాలను ఇక ముందు కూడా పొడగించాలని సూచించింది.  మనదేశంలో  రిఫైన్డ్​ ఫ్యూయల్​ వాడకంలో ఐదింట రెండు వంతుల వాటా డీజిల్​కే ఉంటుంది. ఇందులో 80శాతాన్ని రవాణా రంగంలో ఉపయోగిస్తారు.

బ్యాటరీతో నడిచే సిటీ డెలివరీ వెహికల్స్​కు మాత్రమే 2024 నుంచి రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అనుమతించాలని ప్యానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొంది. వస్తువుల రవాణా కోసం రైల్వేలను,  గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నడిచే ట్రక్కులను ఎక్కువగా ఉపయోగించాలని సూచించింది. రెండు మూడేళ్లలో రైల్వే నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్ పూర్తిగా ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారనుంది.  సుదూర బస్సులు భవిష్యత్​లో బ్యాటరీలతో  నడిచేలా చేయాల్సి ఉంటుందని, రాబోయే 10–-15 సంవత్సరాల్లో గ్యాస్​ వాడకాన్ని విపరీతంగా పెంచాలని స్పష్టం చేసింది. భారతదేశం తన ఇంధనంలో గ్యాస్ వాటాను 2030 నాటికి 6.2శాతం నుండి 15శాతంకి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.