మీ ఉద్యోగాలు మేం తీసేయం.. మీరే వెళ్లిపోండి : Youtube AI ఎఫెక్ట్

మీ ఉద్యోగాలు మేం తీసేయం.. మీరే వెళ్లిపోండి : Youtube AI ఎఫెక్ట్

కర్ర విరక్కుండా పాము చావకుండా అన్న సామెత మాదిరి ఇది.. ఉద్యోగులను తీసేస్తాం అని చెప్పారు.. కాకపోతే వాళ్ల తీసేయరు అంట.. ఉద్యోగులే వాళ్లకు వాళ్లే వెళ్లిపోవాలంట.. మేం ఉద్యోగాలు వదిలి పెట్టి వెళ్లం.. ఇక్కడే ఉంటాం అని మారాం చేస్తే మాత్రం ఆ తర్వాత సినిమా చూపిస్తారు అంట.. అర్థం అయ్యిందా రాజా ఐటీ కంపెనీల్లో ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందో. లేటెస్ట్ గా యూట్యూబ్.. అదేనండీ మన అందరికీ సుపరిచితం అయిన యూట్యూబ్.. ఇది లేకపోతే రోజు గడవదు కదా.. ఇప్పుడు యూట్యూబ్ లేఆఫ్స్ దిశగా అడుగులు వేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. AI దిశగా యూట్యూబ్ ను మార్చబోతుంది. అందుకు తగ్గట్టుగా కొత్త ఉద్యోగులను తీసుకోవటంతోపాటు ఉన్న పాత ఉద్యోగులను వదిలించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉద్యోగులకు ఓ ఆఫర్ ప్రకటించింది. మీ అంతట మీరే ఉద్యోగం మానేయండి.. మంచి రిలీవ్ ప్యాకేజీ ఇస్తాం.. మేం మాత్రం ఉద్యోగాలు తీసేయం అంటూ ప్రకటించింది.

యూట్యూబ్ ఉద్యోగులకు ఎసరు పెట్టిన ఏఐ..

యూట్యూబ్ అమెరికాలోని తన ఉద్యోగులకు వాలెంటరీ రాజీనామాలను కోరుతోంది. ఉద్యోగులకు దీనికి గాను మంచి సివరెన్స్ ప్యాకేజీ కూడా అందిస్తామని చెప్పింది. కంపెనీ ప్రస్తుతం ఏఐ వినియోగాన్ని అంతర్గతంగా ప్రవేశపెడుతూ మార్పులు చేపడుతోంది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పిలుపు మేరకు కంపెనీ ఉత్పాదకతను పెంచేందుకు ఏఐ వినియోగాన్ని తప్పనిసరి చేయటంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. దీంతో యూట్యూబ్ సీఈవో నియల్ మోహన్ అంతర్గతంగా ఉద్యోగులకు పంపిన మెమోలో దీని గురించి ఉద్యోగులకు తెలిపారు. 

మూడు విభాగాలుగా యూట్యూబ్.. 

యూట్యూబ్ ఇకపై ఏఐ దిశగా అడుగులు వేస్తోందని.. భవిష్యత్తు మార్పుల దృష్ట్యా ఉద్యోగులను తమకై తాము వెళ్లేందుకు ఆపర్ ప్రకటించింది. అయితే ప్రస్తుతం కంపెనీలో ఎలాంటి జాబ్స్ పాత్రలను పూర్తిగా తొలగించటంలేదని వెల్లడైంది. కానీ కొత్త మార్పుల కింద మెుత్తం 3 వేరువేరు ప్రొడక్ట్ గ్రూప్స్ ఉండబోతున్నట్లు తేలింది. 

►ALSO READ | గూగుల్‌కి కాసులు కురిపించిన AI.. Q3లో రూ.8లక్షల 50వేల కోట్ల రికార్డ్ ఆదాయం..

గతంలో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న క్రిస్టియన్ ఓస్ట్లియన్.. యూట్యూబ్ మ్యూజిక్ అండ్ ప్రీమియం, యూట్యూబ్ TV, ప్రైమ్‌టైమ్ ఛానెల్‌లు, పాడ్‌కాస్ట్‌లు వంటి సబ్‌స్క్రిప్షన్ సేవల విభాగానికి నాయకత్వం వహిస్తారని వెల్లడైంది. ఇక యూట్యూబ్ ప్రధాన యాప్, లివింగ్ రూమ్, సెర్చ్ అండ్ డిస్కవరీ, యూట్యూబ్ కిడ్స్, లెర్నింగ్ అండ్ ట్రస్ట్ అండ్ సేఫ్టీని కవర్ చేసే వ్యూయర్ ప్రొడక్ట్స్ బృందానికి చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ జోహన్నా వూలిచ్ హెడ్ గా ఉంటారని వెల్లడైంది. మెుత్తానికి ఏఐ పెద్దపెద్ద టెక్ కంపెనీల్లోని ఉద్యోగులను కూడా గడగడలాడిస్తూ.. ఏ రోజు ఏం జరుగుతుందో అనే భయాలను రేకెత్తిస్తోంది.