 
                                    Google Profits: ఇప్పుడు ప్రపంచంలో ఏమూలకు వెళ్లినా, ఎవరి నోట విన్నా వినిపిస్తున్న ఒకేఒక్క మాట ఏఐ. చదువు రాని వారి నుంచి మేధావుల వరకు అందరినీ ఏదో ఒక విధంగా ఇది కనెక్ట్ చేస్తోంది. ప్రపంచంలో కొనసాగుతున్న ఏఐ పోటీ ప్రస్తుతం టెక్ దిగ్గజాలకు డబ్బు వర్షం కురిపిస్తోంది.
తాజాగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఆల్ఫాబెట్ కంపెనీ రికార్డు స్థాయి ఆదాయాన్ని సాధించిందని వెల్లడించారు. ఈ ఏడాది Q3లో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఏకంగా100 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించి. అంటే మన భారతీయ కరెన్సీ లెక్కల ప్రకారం ఈ మెుత్తం విలువ రూ.8లక్షల 50వేల కోట్ల కంటే ఎక్కువే. కంపెనీ చరిత్రలో ఈ స్థాయి ఆదాయాలను నమోదు చేయటం ఇదే తొలిసారి.
ఈ భారీ ఆదాయం కంపెనీలోని వివిధ విభాగాల్లో నమోదైన భారీ వృద్ధిని సూచిస్తోంది. మరీ ముఖ్యంగా AI వ్యాపార విభాగం, క్లౌడ్ సర్వీసెస్, యూట్యూబ్, గూగుల్ వన్ వంటి సబ్ స్కిప్షన్ ఆధారిత విభాగాలు అభివృద్ధిని చూడటం ఆదాయాలకు కారణంగా వెల్లడైంది. గూగుల్ క్లౌడ్ ఆదాయం 34% పెరిగి 15.16 బిలియన్ డాలర్లకు చేరింది. AI ఆధారిత వినియోగం ద్వారా గూగుల్ జెమినీ AI యాప్ 650 మిలియన్లకు పైగా నెలవారీ యాక్టివ్ వినియోగదారులను పొందింది. ఈ విప్లవాత్మక AI సాంకేతికతలను, విస్తృత పెట్టుబడులను సుందర్ పిచాయ్ "పూర్తి స్టాక్ అప్రోచ్" గా పేర్కొన్నారు. ఇది గూగుల్ ని AI యుగంలో ముందంజలో ఉంచుతుందని అభిప్రాయపడ్డారు.
ALSO READ : 4 నిమిషాలపై 10 నిమిషాల క్లాస్ పీకిన HR
సుందర్ పిచాయ్ 2015 నుంచి ప్రపంచ టెక్ దిగ్గజాల్లో ఒకటైన గూగుల్ సీఈవోగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన నేతృత్వంలోని AI విప్లవంలో గూగుల్ సగటు ఆదాయం 200 మిలియన్ డాలర్ల నుండి ఏకంగా100 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గూగుల్ గత కొంత కాలంగా పెట్టుబడులను AIలో పెట్టి భవిష్యత్తుకు దారి చూపుతోంది. ఈ మొత్తం రికార్డు ఆదాయం గూగుల్ వ్యాపార విభాగాల నుంచి ప్రయోజనం పొందుతున్నాయని, ప్రత్యేకించి AI వృద్ధి ప్రధాన కారణమని పిచాయ్ వివరించారు.
మొత్తానికి సుందర్ పిచాయ్ నేతృత్వంలో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం ద్వారా వ్యాపార వృద్ధిని సుస్పష్టంగా సాధిస్తూ.. 2025 Q3లో బిలియన్ డాలర్ల ఆదాయ రికార్డును సృష్టించింది. ఈ మొత్తం ఆదాయం AI సాంకేతికతలను విస్తృతంగా వినియోగిస్తున్నదనే ప్రధాన సంకేతం. దీంతో సోషల్ మీడియాలో భారత సంతతి సీఈవోపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

 
         
                     
                     
                    