కాసేపట్లో ప్రధాని నివాసంలో కేబినెట్ సమావేశం…కశ్మీర్ పై కీలక నిర్ణయం?

కాసేపట్లో ప్రధాని నివాసంలో కేబినెట్ సమావేశం…కశ్మీర్ పై కీలక నిర్ణయం?

కశ్మీర్ పై కీలక నిర్ణయం తీసుకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. కాసేపట్లో  ప్రధాని నివాసంలో కేబినెట్ సమావేశం జరగనుంది. సాధారణంగా ప్రతీ బుధవారం లేదంటే గురువారాల్లో కేబినెట్ సమావేశం ఉంటుంది. కానీ అందుకు బిన్నంగా ఇవాళ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. కశ్మీర్ అంశంపై సమావేశంలో చర్చిస్తారని  తెలుస్తోంది. కశ్మీర్ కు  స్వయం  ప్రతిపత్తి  కల్పించే  370,  ప్రత్యేక  హక్కులు  కల్పించే  35A  ఆర్టికల్స్ ను  రద్దు  చేయవచ్చనే ప్రచారం  జరుగుతోంది.  కేంద్రం  కీలక  నిర్ణయాలు  తీసుకునే  అవకాశం  ఉన్నందునే  కశ్మీర్ లో  వేలాది  బలగాలను  మోహరించినట్లు  భావిస్తున్నారు.

కేంద్ర  హోంమంత్రి  అమిత్ షా  నిన్న  ఢిల్లీలో  కీలక  సమావేశాలు  జరిపారు.  కశ్మీర్ లో  తాజా  పరిస్థితిపై  భద్రతావ్యవహారాల  కమిటీతో  చర్చించారు. జాతీయభద్రతా  సలహాదారు  అజిత్  దోవల్ ,  హోంశాఖ  కార్యదర్శి  రాజీవ్  గౌబాతో  అమిత్ షా  సమీక్షించారు.  తర్వాత  కశ్మీర్  వ్యవహారాల  అదనపు కార్యదర్శి  జ్ఞానేష్  కుమార్  తోనూ  అమిత్  షా  చర్చలు  జరిపారు. పాక్  ఆక్రమిత  కశ్మీర్ లో  మకాం  పెట్టిన  ఉగ్రవాదులు  దేశంలోకి  చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని  ఇంటలిజెన్స్  వర్గాలు  ఇప్పటికే  సమాచారమందించాయి. స్వాతంత్ర్య  దినోత్సవ  వేడుకల్లో  ఉగ్రవాదులు భారీ  కుట్రకు  ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.  వీటిపైనే  ఈ మీటింగ్ లో  చర్చించినట్టు  సమాచారం.  జమ్మూ  కశ్మీర్ లో  ఆర్థికంగా  వెనుకబడిన  వర్గాలకు  10 శాతం  రిజర్వేషన్ల  కల్పనకు ఉద్దేశించిన  సవరణ  బిల్లును  అమిత్  షా  ఇవాళ  రాజ్యసభలో  ప్రవేశపెట్టనున్నారు.