నేడు ఫిఫా వరల్డ్​ కప్​ ఫైనల్​

నేడు ఫిఫా వరల్డ్​ కప్​ ఫైనల్​
  • కమాన్‌‌‌‌ మెస్సీ!
  • నేడు ఫిఫా వరల్డ్​ కప్​ ఫైనల్​
  • ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌తో అర్జెంటీనా అమీతుమీ
  • రా. 8.30 నుంచి స్పోర్ట్స్‌‌‌‌18, జియో టీవీలో లైవ్‌‌‌‌

దోహా:  నెల రోజులుగా ఫుట్​బాల్​ ఫ్యాన్స్‌‌‌‌ను ఉర్రూతలూగిస్తున్న ఫిఫా వరల్డ్​కప్​  వార్‌‌‌‌ క్లైమాక్స్‌‌‌‌కు వచ్చేసింది. ఓవైపు మాజీ చాంపియన్​ అర్జెంటీనా.. మరోవైపు డిఫెండింగ్​చాంపియన్​ ఫ్రాన్స్ టైటిల్​ ఫైట్​కు రెడీ అయ్యాయి. ఆదివారం  రాత్రి మెగా ఫైనల్‌‌‌‌ జరగనుంది. ఖతర్నాక్‌‌‌‌ ఆటతో ఫైనల్‌‌‌‌ చేరుకున్న ఈ రెండు మేటి జట్ల మధ్య అల్టిమేట్‌‌‌‌ ఫైట్‌‌‌‌.. ఫ్యాన్స్‌‌‌‌కు కిక్‌‌‌‌ ఇవ్వనుంది. ఈ మ్యాచ్​లో అర్జెంటీనా లెజెండ్‌‌‌‌ లియోనల్​ మెస్సీపై స్పెషల్‌‌‌‌ ఫోకస్‌‌‌‌ ఉంది. ఇందులో నెగ్గి కెరీర్​లో లోటుగా ఉన్న కప్​ను ముద్దాడాలని మెస్సీ లక్ష్యంగా పెట్టుకున్నాడు. 35 ఏండ్ల మెస్సీకి  అర్జెంటీనా తరఫున ఇదే చివరి మ్యాచ్‌‌‌‌. టోర్నీలో అంతా తానై జట్టును ఇంతదూరం తెచ్చిన మెస్సీ కప్పు నెగ్గి కల నేర్చుకోవడంతో పాటు,  కెరీర్‌‌‌‌కు ఘనంగా గుడ్‌‌‌‌బై చెప్పేందుకు ఇదే గోల్డెన్‌‌‌‌, లాస్ట్‌‌‌‌ చాన్స్‌‌‌‌ కానుంది. మరోవైపు గత ఎడిషన్‌‌‌‌లో ఫ్రాన్స్‌‌‌‌ను విన్నర్‌‌‌‌గా నిలిపిన ఎంబాపె మరో టైటిల్‌‌‌‌పై కన్నేశాడు. ఈ టోర్నీలో చెరో ఐదు గోల్స్‌‌‌‌ కొట్టిన మెస్సీ, ఎంబాపె ఫైనల్లో కీలకం కాబోతున్నారు. పైగా ఈ  ఇద్దరూ గోల్డెన్‌‌‌‌ బూట్‌‌‌‌ రేసులో కూడా ఉన్నారు. తుదిపోరులో వీళ్లు ఎలా ఆడతారో చూడాలి. 

సూపర్​ ఫామ్​లో లియోనల్​

తన కెరీర్​లో క్లబ్​ టైటిల్స్​తో మొదలుపెడితే.. ప్రతిష్టాత్మక బ్యాలెన్​ డీ ఓర్​ వరకు మెస్సీ అన్నీ గెలిచాడు. కానీ వరల్డ్​కప్​ను మాత్రం నెగ్గలేకపోయాడు. 2014లో చాన్స్​ వచ్చినా.. ఫైనల్లో బ్రెజిల్​ చేతిలో ఓడి రన్నరప్​తో సరిపెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు కెప్టెన్​గా, స్టార్​ ప్లేయర్​గా 18 క్యారెట్ల గోల్డ్​ కప్​ను చేజిక్కించుకోవాలని పక్కా ప్లాన్స్​ వేస్తున్నాడు. మెస్సీకి ఇదే చివరి వరల్డ్​కప్. దాంతో, కప్​  నెగ్గి సాకర్​ లెజెండ్స్​ పీలే, మారడోనా సరసన చోటు సంపాదించాలని భావిస్తున్నాడు. అలాగే1978, 1986లో టైటిల్​ నెగ్గిన అర్జెంటీనాకు ముచ్చటగా మూడో కప్​ను అందించాలని యోచిస్తున్నాడు.  తొలి మ్యాచ్‌‌‌‌లోనే సౌదీ అరేబియా చేతిలో అనూహ్య ఓటమి తర్వాత అర్జెంటీనా బలంగా పుంజుకోవడం వెనుక మెస్సీనే ఉన్నాడు. ప్రతీ మ్యాచ్‌‌‌‌లో అంచనాలను అందుకుంటూ, జట్టు నుంచి తాను అనుకున్న ఆట రాబడుతున్నాడు. ఇప్పటికే ఐదు గోల్స్​తో  సూపర్​ ఫామ్​లో ఉన్న మెస్సీ, జట్టు కొట్టిన పలు గోల్స్​కు కూడా సపోర్ట్​ ఇచ్చాడు. అతనికి  జూలియన్​ అల్వారెజ్​, రొడ్రిగో డి పాల్​, మార్టినేజ్​, డి మారియా నుంచి సరైన సహకారం అందితే అర్జెంటీనాకు తిరుగుండదు. 

ఎంబాపెపైనే భారం..

ఈ టోర్నీలో ఇప్పటివరకు ఐదు గోల్స్​ చేసిన కైలియన్​ ఎంబాపె.. మరో మూడు గోల్స్​కు సాయం అందించాడు. దీంతో ఫైనల్​ మ్యాచ్​లోనూ అతనే కీలకం కానున్నాడు. 2018లో చాంపియన్​గా నిలిచిన ఫ్రాన్స్​కు వరుసగా రెండోసారి టైటిల్​ అందించి ఈ ఘనత సాధించిన బ్రెజిల్​ (1962) సరసన నిలబెట్టాలని చూస్తున్నాడు. అలాగే 19 ఏళ్ల వయసులో తొలిసారి చాంపియన్​గా నిలిచిన తాను కూడా రెండో టైటిల్​తో పీలే సరసన చోటు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. మిచెల్​ ప్లాటిని, జినెదిన్​ జిదానె, థియరీ హెన్రీలాంటి ప్లేయర్లతో మెరిసిన ఫ్రాన్స్​ గత ఏడు వరల్డ్​కప్స్​​లో నాలుగోసారి ఫైనల్​ ఆడుతున్నది. గతంలో ఏ టీమ్​కు ఇలాంటి రికార్డు లేదు. 1998లో కప్​ గెలిచిన దియోడర్​ డెస్​చెంప్స్​ కోచ్​గా రెండోసారి కప్​ను అందించాలని ప్లాన్స్​ సిద్ధం చేశాడు. ఎంబాపెకు తోడుగా థియో హెర్నాండెజ్, రాండల్​ కోలో మువానీ, ఒలివర్​ గిరౌడ్​ కూడా మెరిస్తే ఫ్రాన్స్​కు తిరుగుండదు. అయితే ఫైనల్​కు ముందు ఓ బ్యాడ్​ న్యూస్​ ఫ్రాన్స్​ను కలవరపెడుతోంది. స్టార్​ డిఫెండర్లు వరానె, కొనాటె, కోమన్​ ఆనారోగ్యానికి గురయ్యారు. వైరల్‌‌‌‌ ఫీవర్‌‌‌‌తో  బాధపడుతున్న వీరు శుక్రవారం ట్రెయినింగ్​కు  దూరంగా ఉన్నారు. 

26  ఫైనల్​ పోరు​తో ఫిఫా వరల్డ్​కప్​లో అత్యధిక మ్యాచ్​లు ఆడిన ప్లేయర్​గా మెస్సీ రికార్డు సృష్టిస్తాడు.  6/12  ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు 12 మ్యాచ్​లు జరిగితే అర్జెంటీనా ఆరింటిలో నెగ్గింది. ఫ్రాన్స్​ 3 మాత్రమే గెలిచింది. వరల్డ్​కప్​లో ఆడిన మూడు మ్యాచ్​ల్లో అర్జెంటీనా రెండు గెలిస్తే, ఫ్రాన్స్​ ఒకసారి విజయం సాధించింది.