
ప్రస్తుతం పాక్ లో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చినట్లుగానే గోల్డ్ కూడా భారీగా పెరిగింది. ఇప్పటికే పాక్ లో కిలో టమాటా రూ.300 పలుకుతుండగా.. ఇప్పుడు గోల్డ్ ధర కూడా పెరగడంతో అయోమయం అవుతున్నారు పాక్ జనం. ఇండియాలో బంగారం ధర ఇప్పటికే రూ.38వేల మార్క్ ను చేరుకోగా.. పాకిస్తాన్ లో గోల్డ్ ధర రెండింతలు ఎక్కువ పలుకుతోంది. సోమవారం, ఆగస్ట్ 12న పాకిస్తాన్ లో బంగారం ధర 10 గ్రాములకు రూ.74 వేల588గా ఉంది. పాక్ పరిమాణంలో తులా బార్స్ (11.6638038 గ్రా) బంగారం రూ.87 వేలుగా ఉంది. పాకిస్తాన్ లోని ఒక్కో నగరంలో ఒక్కో ధర పలుకుతోంది.
ఇండియాలో బంగారం ధరలు రూ.38 వేలు మార్క్‌ను అధిగమించాయి. త్వరలో రూ.40వేలకు చేరుకుంటుందని బులియన్ వర్గాలు అంచా వేస్తున్నాయి. సిల్వర్ కూడా ఇందే రేంజ్ లో పరుగులు పెడుతోంది. ఫెడ్ వడ్డీరేటు, అమెరికా చైనా ట్రేడ్ వార్ లాంటి అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక వర్తకుల నుండి డిమాండ్ క్రమంలో గోల్డ్ ధర భారీగా పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఇంకా ధర పెరుగుతుందనే టాక్ తో మార్కెట్ లో గోల్డ్ డిమాండ్ బాగా పెరుగుతుంది. దీంతో రోజు రోజుకి సేల్స్ తో పాటు ధరలు కూడా పెరుగుతున్నాయంటున్నాయి మార్కెట్ వర్గాలు.