సిద్ధాంతాలు వేరైనా దేశ ప్రజల సంక్షేమమే ముఖ్యం

సిద్ధాంతాలు వేరైనా దేశ ప్రజల సంక్షేమమే ముఖ్యం

న్యూఢిల్లీ: సిద్ధాంతాల పరంగా ఎన్ని విమర్శలు చేసుకున్నా... అందరి ప్రయారిటీ దేశ ప్రయోజనాలే కావాలని పీఎం మోడీ హితవు పలికారు. పార్టీలు, వ్యక్తులు దేశానికి వ్యతిరేకంగా మారకూడదని సూచించారు. హర్మోన్ సింగ్ 10 వర్థంతిలో మోడీ వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎమర్జెన్సీ సమయంలో  చౌదరి హర్మోన్ సింగ్ యాదవ్ పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కొనియాడారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తే... ప్రధాన పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేశాయని గుర్తు చేశారు. ఇవాళ ప్రజాస్వామ్యానికి చాలా పెద్ద రోజన్నారు. స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారి ఓ గిరిజన మహిళ రాష్ట్రపతి కావడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని చెప్పారు. 

ఇకపోతే... దేశ 15వ రాష్ట్రపతిగా ఆదివాసీ తెగకు చెందిన ద్రౌపది ముర్ము ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి బరిలోకి దిగిన ముర్ము... మోడీ అండదండలతో భారీ మెజారిటీతో విజయం సాధించింది.