శ్రీశైల క్షేత్రంలో ఇవాళ(శుక్రవారం)భ్రమరాంబదేవికి కుంభోత్సవం నిర్వహిస్తారు. చైత్రమాస శుక్రవారం రోజున భ్రమరాంబ అమ్మవారికి కుంభోత్సవం జరిపించడం సంప్రదాయం. కొవిడ్ నిబంధనలను అనుసరించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. ఉత్సవాలను పురస్కరించుకుని భ్రమరాంబదేవి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. భ్రమరాంబ దేవికి కొబ్బరికాయలు, నిమ్మకాయలు, గుమ్మడి కాయలు మొదటి విడత సాత్విక బలిగా సమర్పించనున్నారు. సాంప్రదాయాన్ని అనుసరించి స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడంతో ఉత్సవ ప్రధాన ఘట్టం ప్రారంభమవుతుంది.
