ఫామ్ హౌజ్ ఎమ్మెల్యేల కేసులో నిందితుల కస్టడీపై తీర్పు నేడే

ఫామ్ హౌజ్ ఎమ్మెల్యేల కేసులో నిందితుల కస్టడీపై తీర్పు నేడే

ఫామ్ హౌజ్ ఎమ్మెల్యేల కేసులో నిందితులను ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలన్న సిట్ వాదనలపై నాంపల్లి ఏసీబీ కోర్టు ఇవాళ తీర్పు చెప్పనుంది. కేసులో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయని ఈ సమయంలో   నిందితులను కస్టడీకి ఇస్తే.. సమగ్ర దర్యాప్తు జరుగుతుందని కోర్టుకు తెలిపింది. ఇప్పటికీ బీఎల్ సంతోష్ కు నోటీసులు అందలేదని.. ఆయన సిట్ ఎదుట హాజరయ్యేందుకు గడువు కోరారు తప్ప ఎప్పుడు వస్తారో చెప్పలేదన్నారు. 

ఈ సమయంలో నిందితులకు బెయిల్ ఇస్తే కేసు నీరుగారి పోతుందని సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు. మరోవైపు నిందితుల తరపు న్యాయవాది సిట్ వాదనను వ్యతిరేకించారు. నిందితులకు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇప్పటికే నిందితులను మొయినాబాద్ పోలీసులకు ఐదు రోజులు కస్టడీ ఇచ్చారని కోర్టు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న నాంపల్లిలోని ఏసీబీ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది.