ఇయ్యాల్టి నుంచి కొవాగ్జిన్ టీకా

ఇయ్యాల్టి నుంచి కొవాగ్జిన్ టీకా
  • కొవిషీల్డ్‌‌తో పాటు వేయనున్న హెల్త్ డిపార్ట్​మెంట్
  • రాష్ట్రానికి 1,88,960 కొవాగ్జిన్ డోసులు
  • నేటి నుంచి ప్రైవేట్  హెల్త్ స్టాఫ్‌‌కు కూడా టీకా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వ్యాక్సినేషన్ డ్రైవ్​లో భాగంగా సోమవారం నుంచి కొవిషీల్డ్‌‌తో పాటు, కొవాగ్జిన్ కూడా ఇవ్వాలని హెల్త్ డిపార్ట్​మెంట్ నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే రాష్ట్రానికి 1,88,960 కొవాగ్జిన్ డోసులు వచ్చినట్లు ఆఫీసర్లు చెప్పారు. వ్యాక్సిన్ తీసుకునేటోళ్ల అంగీకారంతోనే కొవ్యాగ్జిన్ ఇస్తామని తెలిపారు. మరోవైపు ప్రైవేట్‌‌ హాస్పిటళ్లలో పనిచేసే హెల్త్ స్టాఫ్‌‌కు కూడా సోమవారం నుంచే వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ కోసం సుమారు 2 లక్షల మంది ప్రైవేట్ స్టాఫ్‌‌ రిజిస్ర్టేషన్ చేసుకున్నారు. వీరికి 200 ప్రైవేట్ హాస్పిటళ్లు, 700 ప్రభుత్వ దవాఖాన్లలో టీకా వేయనున్నారు.

50 కంటే ఎక్కువ మంది స్టాఫ్ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్‌‌‌‌కు తమ సిబ్బందిని పంపించి, అక్కడే వ్యాక్సిన్ వేయిస్తామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. మిగిలిన వాళ్లంతా తమకు దగ్గర్లోని ప్రభుత్వ దవాఖానలోని సెంటర్‌‌‌‌‌‌‌‌లో వ్యాక్సిన్ వేయించుకోవచ్చని చెప్పారు. ఎవరెవరికి ఏ సెంటర్‌‌‌‌‌‌‌‌లో, ఏ టైమ్‌‌‌‌కు వ్యాక్సిన్ వేస్తామో ముందు రోజే సమాచారం అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటిదాకా వ్యాక్సిన్ తీసుకోని ప్రభుత్వ హెల్త్ స్టాఫ్‌‌‌‌కు సోమవారం మరో అవకాశం ఇవ్వనున్నారు. ఈసారి కూడా ముందుకు రాకపోతే, ఆ తర్వాత వ్యాక్సిన్ ఇవ్వబోమని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇక ఈ నెల 19న వ్యాక్సిన్ తీసుకున్న లేడీ హెల్త్ వర్కర్ (45) ఆదివారం ఉదయం చనిపోయారని శ్రీనివాసరావు ప్రకటించారు. ఆమె మరణానికి కారణాలపై డాక్టర్ల కమిటీ విచారణ జరుపుతోందని, పోస్ట్‌‌‌‌మార్టమ్ పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈనెల 20న నిర్మల్‌‌‌‌ జిల్లాలో అంబులెన్స్ డ్రైవర్ వ్యాక్సిన్ తీసుకున్న రెండో రోజే చనిపోయాడు. అయితే ఆయన గుండెపోటుతో చనిపోయినట్టు డాక్టర్లు తేల్చారు.

ఇవి కూడా చదవండి..

ప్రాణహిత ప్రవాహం తగ్గింది.. యాసంగికి నీళ్లెట్ల..?

పనిచేయకున్నా జీతాలు చెల్లింపు.. ఆపై ప్రమోషన్‌తో బదిలీ

గుహలో భారీగా బంగారం నిల్వలు.. కళ్ల ముందే హింట్ ఉన్నా తెరవలేకపోతున్నారు