ఇవాళ (సెప్టెంబర్ 07) యాదగిరిగుట్ట ఆలయం మూసివేత.. మధ్యాహ్నం 12 గంటల వరకే దర్శనాలు

ఇవాళ (సెప్టెంబర్ 07) యాదగిరిగుట్ట ఆలయం మూసివేత.. మధ్యాహ్నం 12 గంటల వరకే దర్శనాలు

యాదగిరిగుట్ట, వెలుగు: సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా ఆదివారం (సెప్టెంబర్ 07) మధ్యాహ్నం 12 గంటలకు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసి వేయనున్నారు.  మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శనానికి అనుమతించి, ఆ తరువాత గుడి మూసి వేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 

యాదగిరిగుట్ట ఆలయంతో పాటు పాతగుట్ట, ఉప ఆలయాలు, అనుబంధ ఆలయాలన్నింటికీ ద్వార బంధనం చేయనున్నారు. సోమవారం ఉదయం 3:30 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ చేయనున్నారు. 

స్వామివారికి సుప్రభాతం, తిరువారాధన, బాలబోగం, నిజాభిషేకం, సహస్రనామార్చన నిర్వహించి, ఉదయం 8:15 గంటల నుంచి దర్శనాలు ప్రారంభిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆలయ అధికారులు సూచించారు.