గుగుల్ ఎర్త్ తో ప్రపోజ్.. ‘మ్యారీమీ’ వచ్చేలా ప్రయాణం

గుగుల్ ఎర్త్ తో ప్రపోజ్.. ‘మ్యారీమీ’ వచ్చేలా ప్రయాణం

7000 కిమీ..6 నెలల ప్రయాణం 
చేతిలో గులాబీ పువ్వు పట్టుకుని ఎదురుగా వెళ్లి మోకాలుపై కూర్చుని అమ్మాయి కళ్లలోకి చూస్తూ ‘ఐ లవ్‌ యూ’ చెప్పడం ఓల్డ్ ఫ్యాషన్! బ్యూటిఫుల్ లేడీ కోసం బ్యూటిఫుల్ ఐడియాతో వేశాడో యువకుడు. అతని ప్రపోజల్ గిన్నిస్ రికార్డుకెక్కింది. గూగుల్‌‌‌‌‌‌‌‌ తల్లి ట్విట్‌‌‌‌‌‌‌‌ చేసిన ఈ ప్రేమ కథ మీకోసం. అది2008. యసుషీ తన గర్ల్ ఫ్రెండ్ నట్ సుకీని పెళ్లికి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు. ఇందుకోసం గూగుల్‌‌‌‌‌‌‌‌ ఎర్త్‌‌‌‌‌‌‌‌ ను వాడాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లే‘MARRY ME’ అనే ఆకారంలో ఆరు నెలలు పాటుహోకైడో ద్వీపంలో 7000 కిలోమీటర్ల పాటు అలుపెరుగని ప్రయాణం చేశాడు. దాన్ని ‘గూగుల్ స్ట్రీట్వ్యూ’ తో రీక్రియేట్ చేయడానికి పదేళ్లు పట్టింది. తనప్రేమ కోసం తపించిన బాయ్ ఫ్రెండ్ ప్రపోజల్ ను చూసి నట్ సుకీ ఆశ్చర్యపోయింది. అతడు ప్రపోజ్చేయగానే ఒప్పేసుకుంది. ఈ ప్రేమ కథ వీడియోను గూగుల్‌‌‌‌‌‌‌‌ రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేసిన ఐదు గంటల్లోనే 17 వేల మంది చూసేశారు. ది గ్రేటెస్ట్ ప్రపోజల్ ఎవర్ అంటూ నెటిజన్స్ యసుషీని తెగపొగిడేస్తున్నారు.