ఐపీఎల్​ బాటలోనే టోక్యో ఒలింపిక్స్​!

ఐపీఎల్​ బాటలోనే టోక్యో ఒలింపిక్స్​!
  •     స్టేట్​ ఆఫ్​ ఎమర్జెన్సీ ఎక్స్​టెండ్​ చేయనున్న జపాన్?
  •     అదే జరిగితే గేమ్స్​ రద్దయ్యే చాన్స్​

న్యూఢిల్లీ: ఐపీఎల్​ను దెబ్బకొట్టిన కరోనా.. మరో మెగా ఈవెంట్​పై పంజా విసరబోతున్నది. ఇప్పటికే ఓసారి వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్​ పూర్తిగా రద్దయ్యే  దిశగా అడుగులు పడుతున్నాయి. టోక్యో, దాని చుట్టుపక్కలా ఉన్న మేజర్​ అర్బన్​ ఏరియాస్​లో స్టేట్​ ఆఫ్​ ఎమర్జెన్సీ మరికొన్ని రోజులు పొడిగించాలని జపాన్​ గవర్నమెంట్​ యోచిస్తున్నది. దీంతో సమ్మర్​ ఒలింపిక్స్​ నిర్వహణపై డౌట్స్​ మొదలయ్యాయి. టోక్యో, ఒసాకా, కోట్యో, హోగోలో కొవిడ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. గవర్నమెంట్​ అఫీషియల్​ ఎక్స్​టెన్షన్​పై దృష్టిపెట్టారని లోకల్​ న్యూస్​ పేపర్​ ఒకటి కథనాన్ని ప్రచురించింది. ఏప్రిల్​ 25న విధించిన రూల్స్​ను మరికొన్ని రోజులు పొడిగించడంతో పాటు లోకల్​ ఫ్యాన్స్​ను అనుమతించే విషయంపై అధికారులు తర్జన భర్జన పడుతున్న నేపథ్యంలో జులై 23న గేమ్స్​ స్టార్ట్​ కావడం కష్టమేనని రాసుకొచ్చింది.

ఎక్స్​టెన్షన్​ విషయంపై జపాన్​ ప్రధాని ​సుగా బుధవారం సీనియర్​ మినిస్టర్స్​తో చర్చించారు. అయితే ఎమర్జెన్సీని ఎన్ని రోజులు పొడిగిస్తారన్న దానిపై కచ్చితమైన నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ.. కనీసం మూడు వారాల పాటు ఉండే అవకాశం ఉందని ఒసాకా గవర్నమెంట్​ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంపై మాట్లాడేందుకు ప్రధాని ఆఫీస్​కు కాల్​ చేసినా రెస్పాన్స్​ కాలేదని  ఓ వార్తా సంస్థ  వెల్లడించింది. యాన్యువల్​ గోల్డెన్​ వీక్స్​ సందర్భంగా బుధవారం జపాన్​ గవర్నమెంట్​ ఆఫీస్​, ఫైనాన్షియల్​ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. మరోవైపు ఒలింపిక్ నిర్వాహకులు మాత్రం గేమ్స్​ రద్దుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. జూన్​ ఎండ్​ వరకు ఎంత మంది ఫ్యాన్స్​ వస్తారన్న దానిపై ఓ అంచనాకు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకునే చాన్స్​ ఉంది. స్టేట్​ ఆఫ్​ ఎమర్జెన్సీలో భాగంగా టోక్యో, ఇతర అర్బన్ ప్రాంతాల్లో రెస్టారెంట్స్​, బార్స్​,  పెద్దపెద్ద డిపార్ట్​మెంట్​ స్టోర్స్​, సినిమా హాల్స్​ను మూసి వేయడంతో పాటు, బిగ్​ స్పోర్టింగ్​ ఈవెంట్స్​ను రద్దు చేశారు.