
రేపు మధ్యాహ్నం కీలక భేటీ జరగనుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్‌ని చిత్రపరిశ్రమ పెద్దలు కలవనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేశ్ బాబు, రాజమౌళి, కొరటాల శివ మొదలైనవారు కలవనున్నారు. చిత్ర పరిశ్రమ సమస్యలపై సీఎం జగన్‌తో ఈ సమావేశంలో చిత్రపరిశ్రమ బృందం చర్చించనున్నారు. ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదివరకే టాలీవుడ్ నుంచి చిరంజీవి మాత్రమే జగన్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈసారి చిరు వెంట పలువురు సినీ పరిశ్రమకు చెందిన హీరోలు, డైరెక్టర్లు ఉండటంతో ఈ భేటీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీంతో సినిమా టికెట్ల ధరల అంశంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి: