గ‌ద్దర్ కు సినీ ప్రముఖుల నివాళులు

గ‌ద్దర్ కు సినీ ప్రముఖుల నివాళులు

ప్రజాగాయకుడు గద్దర్ కన్నుముశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 2023 ఆగస్టు 06 ఆదివారం ఆయన తుదిశ్వాస విడిచారు. గద్దర్  మృతి పట్ల టాలీవుడ్ చిత్ర ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.  

గద్దర్ లేని లోటు ఎవ్వరు తీర్చలేరని సీనియర్ నటి జీవిత అన్నారు.  గద్దర్ మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు.  తమ కుటుంబానికి గద్దర్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు.  ఈరోజు గద్దర్ లేరన్న వార్త నమ్మలేకపోతున్నానని చెప్పారు.  

ఒక గొప్ప కళాకారుడిన కోల్పోయామని సినీ సంగీత దర్శకుడు కీరవాణి అన్నారు.  గద్దర్ చూడడానికి అగ్రిసివ్ గా కనపడిన ఆయన మనసు సున్నితం అని చెప్పారు.  తన తల్లిదండ్రుల సమాధి వద్దే తనను కూడా పెట్టాలని చివరిగా గద్దర్ తనతో మాట్లాడిన మాటలని తెలిపారు.  ఆయన లేని లోటు ఎన్నటికీ తిరనిదని కీరవాణి చెప్పారు.  

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గద్దర్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

మరోవైపు గద్దర్ అంత్యక్రియలు 2023 ఆగస్టు 07న  ప్రభుత్వ లాంఛనాలతో  జరగనున్నాయి.  గద్దర్ స్థాపించిన మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు చేయనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.