
హైదరాబాద్: ‘లవ్ స్టోరి’ సినిమా తీయడానికి పిల్లలే కారణమని ప్రముఖ టాలీవుడ్ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. చిన్నారుల భద్రత చాలా ముఖ్యమని చెప్పిన ఆయన.. పిల్లలకు సురక్షితమైన వాతావరణం సృష్టించాలన్నారు. లర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైల్డ్ సేఫ్టీ ఫ్లెడ్జ్ లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి శేఖర్ కమ్ముల హాజర్యయారు. లైంగిక వేధింపులు అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు కూడా తప్పడం లేదని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు.