Vishwak Sen: ఇన్స్టా అకౌంట్ క్లోజ్ చేసిన విశ్వక్.. వివాదం తరువాతే ఎందుకు ఇలా?

Vishwak Sen: ఇన్స్టా అకౌంట్ క్లోజ్ చేసిన విశ్వక్.. వివాదం తరువాతే ఎందుకు ఇలా?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సోషల్ మీడియాకు దూరం అయ్యారు. తాజాగా ఆయన తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను క్లోజ్ చేశారు. ఈ న్యూస్ తెలుసుకున్న విశ్వక్ సేన అభిమానులు కంగారు పడుతున్నారు. ఇంత సడన్ గా సోషల్ మీడియా నుండి అవుట్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు విశ్వక్ సేన్ ఇన్స్టా అకౌంట్ కు ఎం అయ్యింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన వివాదమే విశ్వక్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. 

Also Read:OTTకి విజయ్ సేతుపతి మహారాజ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. విశ్వక్ సేన్ ఇటీవల సోషల్ మీడియాలో సినిమాలపై రివ్యూలు ఇచ్చే బ్యాచ్ గురించి ఓ పోస్ట్ పెట్టారు. కల్కి సినిమా గురించి ఒక యూట్యూబర్ చేసిన వీడియో గురించి ప్రస్తావిస్తూ.. ఇంకా విడుదల కూడా కానీ సినిమా గురించి అప్పుడే రివ్యూలో ఇవ్వడం మొదలుపెట్టేశారు. మీకు దమ్ముంటే ఒక షార్ట్ ఫిల్మ్ చేసి చూపించు అంటూ కౌంటర్ వేశాడు. దానికి ఆ యూట్యూబర్ కూడా అదే రేంజ్ లో గట్టిగానే సామాధానం ఇచ్చాడు. 

ఈ వివాదం జరిగిన కొన్నిరోజులకే విశ్వక్ సేన్ సోషల్ మీడియా నుండి బయటకు వచ్చేశాడు. దాంతో ఆ వివాదం కారణంగానే ఆయన ఇలా చేసుంటారని అందరు అనుకుంటున్నారు. కొందరేమో.. ప్రస్తుతం విశ్వక్ సేన్ సినిమాలేవి విడుదలకు సిద్ధంగా లెవ్. మళ్ళీ సినిమా రిలీజ్ టైం కి ఇన్స్టాకి వస్తారని కొందరు అభిప్రాయం పడుతున్నారు. మరి.. నిజంగా విశ్వక్ సోషల్ మీడియా నుండి ఎందుకు లెఫ్ట్ అయ్యారు అనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.